న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్‌ నుంచి తప్పుకున్న సైనా.. ఎందుకో తెలుసా?!!

Saina Nehwal Pulls Out of PBL Season 5 to Prepare For Next Season

న్యూఢిల్లీ: గత ఏడాది కాలంగా పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తున్న భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వచ్చే ఏడాది జనవరిలో ఆరంభమయ్యే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌ నుంచి వైదొలిగింది. వచ్చే ఏడాది బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఎర్రబంతి కంటే గులాబీ బంతే స్పష్టంగా కనిపిస్తుంది: దాదాఎర్రబంతి కంటే గులాబీ బంతే స్పష్టంగా కనిపిస్తుంది: దాదా

'పీబీఎల్‌ ఐదో సీజన్‌ ఆడటం లేదు. గాయాలు, అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా. అందుకే పీబీఎల్‌ సీజన్‌ సమయాన్ని నా ఆట మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు వెచ్చించాలని నిర్ణయించుకున్నా. తర్వాతి సీజన్‌లో ఆడేందుకు ప్రయత్నిస్తా' అని సైనా ఆదివారం ట్వీట్ చేసింది.

గత సీజన్‌లో నార్త్ ఈస్టెన్ వారియర్స్ తరఫున ఆడిన సైనా.. ఈసారి పీబీఎల్ వేలంలో పాల్గొనడం లేదు. ఈ సీజన్‌ పీబీఎల్‌ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది. పాంక్రియాటిస్‌, గాయాల కారణంగా ఈ సంవత్సరం చాలాకాలం ఆటకు దూరంగా ఉంది. కాగా సైనా ఈ సంవత్సరం పలు టోర్నీలలో ఆరుసార్లు మొదటి రౌండ్లలో పరాజయం చవిచూసింది.

ఇటీవలే ముగిసిన హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ తొలి రౌండ్‌లో సైనా 13-21, 20-22తో కాయ్‌ యాన్‌ యాన్‌ (చైనా) చేతిలో ఓటమిపాలయింది. కేవలం 30 నిమిషాల్లోనే సైనా గేమ్‌లలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. అంతకుముందు చైనా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే సైనా ఇంటిదారి పట్టినవిషయం తెలిసిందే.

Story first published: Monday, November 25, 2019, 8:53 [IST]
Other articles published on Nov 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X