'సైనా... కశ్యప్‌ని పెళ్లి చేసుకుని డేటింగ్ రూమర్స్ నిజం చేయి'


హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ డేటింగ్‌లో ఉన్నారంటూ గతంలో ఎన్నోసార్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ డేటింగ్ రూమర్లను పెళ్లితో నిజం చేయాలని అభిమానులు కోరుతున్నారు.
అసలేం జరిగింది?
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో పారుపల్లి కశ్య్‌పతో కలిసి దిగిన ఫొటోను సైనా నెహ్వాల్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
దీంతో సైనా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోపై నెటిజన్లు కామెంట్లు ఈ విధంగా కామెంట్లు పెట్టారు. 'ఇద్దరిదీ పర్‌ఫెక్ట్ జోడీ' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా 'చూడ్డానికి చక్కగా ఉన్నారు.. డేటింగ్ వార్తలను నిజం చేయండి.. ప్లీజ్' అంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
'ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో చాలామంది జంటలుగా మారారు, మీరూ వాళ్లను అనుసరించండి' అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications