సైనా నెహ్వాల్(పెళ్లి) గురించి వైరల్‌గా మారిన పోస్టు ఇదే..

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో తామిద్దరూ ఒకటవబోతున్నట్లు సైనా ప్రకటించారు. అయితే ఈ మధ్య ఆమె వివాహం గురించి ఒక పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఒకే క్రీడకు చెందిన ఇరువురికి వివాహం జరుగుతుండటంతో వీరి పెళ్లికి మంచి జోష్ వచ్చి చేరింది. సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం జరగనుంది. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ వచ్చే నెల 16న వివాహం చేసుకోనున్నారు.

గోపీచంద్ అకాడమీలో శిక్షణ సమయంలోనే
వీరి వివాహానికి సంబంధించిన ఓ పెళ్లిపత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ప్రముఖ హోటల్ వేదికగా వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. 2005 నుంచి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకొంటున్న సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని సైనా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇన్నాళ్లు వాయిదా వేయడానికి కారణం:
కెరీర్ కోసం వివాహాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పలేదని, వాళ్లే దాన్ని పసిగట్టేశారని చెప్పారు ఈ మాజీ నంబర్ వన్.

ఎవరితో సన్నిహితంగా ఉంటున్నానో వారే
‘వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం, మా తల్లిదండ్రులతో కలిసి అనేక సార్లు ప్రయాణం చేశాం. ఆ సమయంలో నేను ఎవరితో సన్నిహితంగా ఉంటున్నానో వారు అర్థం చేసుకున్నారు' అని సైనా చెప్పుకొచ్చారు. వివాహం అనంతరం సైనా డిసెంబర్ 22నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో ఆమె నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌కు ఆడనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications