గవర్నర్, కేటీఆర్, చిరంజీవిలను ఆహ్వానించిన సైనా, కశ్యప్‌లు

న్యూ ఢిల్లీ: మరో సెలబ్రిటీ జంట వివాహానికి సిద్ధమవుతున్న వేళ.. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్, మరో ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌లు పెళ్లి పిలుపులతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇరువురి కుటుంబాల్లో తమ ప్రేమకు అంగీకారం తెలుపడంతో వారి వివాహ వేడుకను డిసెంబర్ పదహారో తేదీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో డిసెంబర్ 16 ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్ జరుగనున్నాయి.
నరసింహన్ దంపతులకు స్వయంగా తామే
హైదరాబాద్‌లోని నోవోటెల్ హోటల్‌లో సాయంత్రం 6.30 నుంచి రిసెప్షన్ ఆరంభమవుతుంది. వీరి వివాహానికి హాజరుకానున్న సెలబ్రిటీలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది ఈ జంట. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులకు స్వయంగా తామే హాజరై పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ తర్వాత అదే ఫొటోను తమను నరసింహన్ దంపతులు ఆశీర్వదించారంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
వెడ్డింగ్ రిసెప్షన్‌లో కలుసుకుందాం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లను కలిసి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇచ్చారు. కేటీఆర్‌ను కలిసినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ.. 'తెలంగాణలో క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. మా వెడ్డింగ్ రిసెప్షన్‌లో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను.' అని ట్వీట్ చేసింది.
కలిసినందుకు లవ్లీగా ఫీలవుతున్నా
చిరంజీవి నివాసంలో ఆయనను స్వయంగా కలుసుకుని... తమ వివాహానికి ఆహ్వానించారు. మెగాస్టార్, ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలు దిగి సైనా, కశ్యప్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మిమ్మల్ని కలిసినందుకు లవ్లీగా ఫీలవుతున్నాను. మీ జీవితం మాకెంతో స్ఫూర్తిధాయకం. మీతో మాట్లాడినంతసేపు చాలా బాగా అనిపించింది. శ్రీజ వల్లనే ఇది కుదిరింది. థ్యాంక్యూ' అని ట్వీట్‌లో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications