డిసెంబర్‌లో పెళ్లి చేసుకోనున్న సైనా నెహ్వాల్: వరుడు ఎవరో తెలుసా?

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. సహచర ఆటగాడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఈ విషయాన్ని వారు అధికారికంగా ఎన్నడూ ప్రకటించలేదు.

సైనా-కశ్యప్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్
ఇటీవలే వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి పెళ్లికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లికి సంబంధించి వివాహం తేదీని కూడా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. సైనా నెహ్వాల్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సైనా-కశ్యప్ జోడీ డిసెంబర్ 16న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కొద్దిమందికి మాత్రమే ఆహ్వానాలు
వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరగనుంది. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు. డిసెంబర్ 16న పెళ్లి, డిసెంబర్ 21న వైభవంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 21న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
సైనా-కశ్యప్ రిసెప్షన్ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. గత కొంతకాలంగా సైనా-కశ్యప్‌లు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినప్పటికీ, వీటిపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అదేవిధంగా ఈ వార్తలను సైతం ఖండించ లేదు.

సైనా జీవితం ఆధారంగా సినిమా
2005లో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో వీరద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లి పీటలెక్కుతున్నారు. కాగా, సైనా జీవితం ఆధారంగా ‘సైనా' అనే సినిమా రాబోతోంది. సైనా పాత్రలో బాలీవుడ్ నటి శ్రధ్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications