Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గురుపు గోపీచంద్‌కు దూరమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్

Saina Nehwal
హైదరాబాద్: హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన గురువు, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం సారాంశం. ప్రస్తుతం సైనాకు భాస్కరబాబు పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మీడియా కథనాలు, బ్యాడ్మింటన్‌ వర్గాల ప్రకారం - గోపీచంద్‌ శిక్షణకు సైనా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం భాస్కరబాబు దగ్గర ఆమె తర్ఫీదు పొందుతోంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ వరకు భాస్కరబాబు వద్దే శిక్షణ తీసుకోవాలని ఆమె భావిస్తోంది.

నిరుడు హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ సమయంలో సైనా క్రమశిక్షణ పట్ల గోపీ అసంతృప్తి వ్యక్తంజేశాడు. అనంతరం సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సందర్భంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ముదిరాయి. ఆ టోర్నీలో ఆడాలని గోపీ చెప్పగా సైనా పెడచెవిన పెట్టింది. పైకి గాయం కారణమని చెప్పినా ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌ కోసం సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ నుంచి సైనా తప్పుకున్నట్లు బ్యాడ్మింటన్‌ వర్గాలంటున్నాయి. అప్పట్నుంచి శిక్షణ విషయంలో గోపీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

''కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాలు అందించడం నా మొదటి లక్ష్యం. జాతీయ కోచ్‌గా యువ క్రీడాకారులపై దృష్టిసారించడం కూడా నా బాధ్యత. సైనాకు ఫుల్‌టైమ్‌ కోచ్‌ కావాలి. ఆ బాధ్యతలు భాస్కరబాబు నిర్వహిస్తున్నారు'' అని గోపీచంద్‌ వ్యాఖ్యానించినట్లు ప్రముఖ దినపత్రిక రాసింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సైనా వివరించింది. ''గత ఐదేళ్ళుగా భాస్కరబాబు నాతో కలిసి టోర్నీలకు వస్తున్నాడు. జాతీయ శిక్షణ శిబిరాల్లో ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్నా. ఆయన శిక్షణ విధానం నాకు నచ్చుతుంది. అందుకే టోర్నీలకు ఆయనతో కలిసి వెళ్తున్నా. గోపీ సర్‌ను సంప్రదించే శిక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నాం'' అని సైనా తెలిపినట్లు ఆ పత్రిక రాసింది
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+