హైదరాబాదీ సైనా నెహ్వాల్‌కు షాక్, తొలి రౌండ్‌లోనే పరాజయం

స్మాష్‌లు (10-6), ర్యాలీ (42-36)లలో గోటో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. చీలమండ గాయానికి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సైనా కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. తొలి గేమ్‌ను గోటో 2-0తో ఆరంభించింది. 4-1, 4-3, 7-3, 7-5, 9-6తో దూసుకెళ్తున్న గోటోను 10-10తో నిలువరించింది సైనా. ఐతే వెంటనే తేరుకున్న గోటో 14-11, 16-14, 19-14, 19-17తో ముందుకెళ్ళి 21-17తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్‌ను సైనా 3-0తో ఆరంభించింది. ఐతే సైనా ఆధిక్యాన్ని ఎంతోసేపు నిలవనివ్వలేదు గోటో. ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో 11-11తో స్కోర్లు సమమయ్యాయి. 14-11తో సైనా ఆధిక్యం సాధించినా పాయింట్ల వ్యత్యాసాన్ని గోటో తగ్గిస్తూ సాగింది. ఓ దశలో 19-16తో సైనా రెండో గేమ్ గెల్చుకునేట్లు కనిపించింది. ఐతే వరుసగా ఐదు పాయింట్లు గెల్చుకున్న గోటో 21-19తో సైనాను మట్టికరిపించింది.
ఆంధ్రప్రదేశ్ కుర్రాడు రాజా మానూరి వెంకట గురుసాయిదత్, సౌరభ్ వర్మ సంచలనాలు ఊరటనిచ్చాయి. గురుసాయిదత్, సౌరభ్ పురుషుల సింగిల్స్‌లో సంచలనాలకు తెరతీశారు. తొలిరౌండ్లో గురు 22-20, 18-21, 21-19తో నాలుగో సీడ్ పోన్సానా (థాయ్‌లాండ్)కు షాకిచ్చాడు. గంటా మూడు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో గురు అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం కనబరిచి తొలిరోజు టోర్నీకే ఆకర్షణగా నిలిచాడు. క్వాలిఫయర్ సౌరభ్ తొలి రౌండ్లో 21-18, 21-19తో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ సోనీ కుంకారో (ఇండోనేసియా)పై నెగ్గాడు.
ప్రిక్వార్టర్స్‌లో యుహాన్ టాన్ (బెల్జియం)తో గురుసాయిదత్, ఏడో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో సౌరభ్ తలపడనున్నారు. పారుపల్లి కశ్యప్ 21-, 21-15తో మైకెల్ మతెజ్కా (స్లొవేకియా)పై నెగ్గి, రెండో సీడ్ తౌఫిక్ హిదాయత్ (ఇండోనేసియా)తో పోటీకి సిద్ధమయ్యాడు. రాష్ట్రానికే చెందిన పీవీ సింధుకు తొలిరౌండ్లో చుక్కెదురైంది. ఎనిమిదో సీడ్ సలక్‌జిత్ పోన్సానా (థాయ్‌లాండ్) 21-19, 22-20తో సింధును ఓడించింది.
మహిళల డబుల్స్‌లో పీసీ తులసి- సిక్కిరెడ్డి (భారత్) 7-21, 11-21తో హూ చిన్- పీ వాంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రూపేశ్- సనావే థామస్, మహిళల డబుల్స్ తొలిరౌండ్లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప, పోలవరపు జ్యోత్స్న- ప్రద్య్న గాద్రె జోడీలకు బై లభించింది. డిజూకు శస్త్రచికిత్స జరగడంతో మిక్స్‌డ్ డబుల్స్ నుంచి జ్వాల జోడీ తప్పుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications