Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్లీన్ స్పోర్ట్: సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడను గౌరవనీయమైన క్రీడగా ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఐదుగురు క్రీడాకారులను అంబాసిడర్లుగా ఎంపిక చేసింది.

అందులో సైనా నెహ్వాల్ ఒకరు. మొత్తం ఐదుగరు టాప్ ప్లేయర్లను 'ఫెయిర్ అండ్ హనరబుల్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ అంబాసిడర్స్' గా ఎంపిక చేసినట్లు బీడబ్ల్యూఎఫ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వీరంతా కూడా బ్యాడ్మింటన్‌ను క్లీన్, ఫెయిర్, గౌరవనీయమైన క్రీడగా ప్రమోట్ చేయనున్నారు.

డెన్మార్క్‌కు చెందిన క్రిస్టిన్నా పిడెర్సెన్, విక్టర్ అక్సెల్సెన్‌లు, జపాన్‌కు చెందిన డబుల్స్ పెయిర్ మిసాకి మత్సుతోమో, అయకా తకాహషిలు ఈ ఐదుగురిలో ఉన్నారు. దుబాయిలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ డిప్యూటీ ప్రెసిడెంట్ గుత్సావో సలాజర్ అంబాసిడర్లను మీడియాకు పరిచయం చేశారు.

 Saina Nehwal named Integrity Ambassador to promote clean sport

బ్యాడ్మింటన్‌ను ప్రపంచ వ్యాప్తంగా మరింతగా వృద్ధి చేసేందుకు గాను బీడబ్ల్యూఎఫ్ తీసుకున్న కొత్త చర్యల్లో 'ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్' అని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా బీడబ్ల్యూఎఫ్ తరఫున అంబాసిడర్లు ప్రపంచ వ్యాప్తంగా వీరు పలు క్యాంపెయిన్‌లలో పాల్గొంటారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+