దుబాయ్: భారత్ ఏస్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్ చేతిలో 21-11, 13-21, 9-21 తేడాతో సైనా ఓటమి పాలైంది.
55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచులో వరల్డ్ నెంబర్ 9 ర్యాంకు క్రీడాకారిణి తైజు యింగ్ గెలుపొందింది. టోర్నీలో మూడు విజయాలు సాధించిన సైనా నెహ్వాల్ టోర్నీ విజేతగా నిలుస్తుందని భావించినప్పటికీ.. సెమీ ఫైనల్లో తైపీ క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైంది.

2011లో జరిగిన ఈ టోర్నీలో వరకు వెళ్లిన సైనా నెహ్వాల్, ఈసారి టోర్నీలో మొదటి మ్యాచ్ నుంచి చాలా ఉత్సాహంగా ఆటను కొనసాగించింది. మూడు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. తైపీ క్రీడాకారిణి నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న సైనా చివరి వరకు పోరాడి చేతులెత్తేసింది.
కాగా, కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ ఏడాది శ్రీకాంత్ అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తున్నాడు. సైనా పరాజయం పాలైన నేపథ్యంలో భారత్ ఆశలు శ్రీకాంత్‌పైనే ఉన్నాయి.