
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ నుంచి అరుదైన కానుకని అందుకుంది. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇంతకీ అనుష్క శర్మ నుంచి సైనా నెహ్వాల్ అందుకున్న అవార్డు ఏంటని అనుకుంటున్నారా!
అనుష్క శర్మ 'నుష్' పేరిట దుస్తుల వ్యాపార రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ కొన్ని దుస్తులను సైనాకు గిప్ట్‌గా పంపించింది. వీటిని అందుకున్న సైనా నెహ్వాల్ అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి అనుష్కకు ధన్యవాదాలు తెలిపింది.
త్వరలోనే వీటిని ధరిస్తానని చెప్పిన సైనా... వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినందుకుగాను అనుష్కకు శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ముంబైలో నిర్వహించిన ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ప్రస్తుతం సైనా చైనా ఓపెన్‌లో బరిలోకి దిగుతోంది.