హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కోచ్ అవతారమెత్తింది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌కి బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇచ్చింది. ఇటీవలే హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీకి వచ్చిన సైనా... శ్రద్ధా కపూర్‌తో ప్రాక్టీస్ చేయించింది. దీనికి సంబంధించిన వీడియోని సైనా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన సైనా నెహ్వాల్ నిజజీవితం ఆధారంగా 'సైనా' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రద్ధాకపూర్.. సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తోంది. ఇందులో భాగంగా సైనా పర్యవేక్షణలో శ్రద్ధాకపూర్ ప్రాక్టీస్ చేస్తోంది.