హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆదివారం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో భాగంగా యూనివర్సిటీలోని టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిస్నాతకోత్సవంలో భాగంగా వర్సిటీ చాన్స్‌లర్ సత్యనారాయణన్, యుఎస్ అంబాసిడర్ ఎవన్ శామ్యుల్ డుబెల్‌ల చేతుల మీదుగా సైనా నెహ్వాల్‌కు గౌరవ డాక్టరేట్ డిగ్రీని సైనా నెహ్వాల్‌కు అందజేశారు. అలాగే సైనాతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, డాక్టర్ ఏఆర్ లక్ష్మణన గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడారు. గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. క్రీడారంగానికి చెందిన తనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్‌ను ప్రప్రథమంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అందజేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తనని చూసి మా నాన్న చాలా మురిసిపోతుంటారని పేర్కొంది.

ఎందుకంటే ఆయన ఓ శాస్త్రవేత్త అని, నేను డాక్టర్ కావాలన్నదే ఆయన కోరిక అని చెప్పింది. అయితే మా అమ్మ మాత్రం తాను మంచి ఒలింపియన్ కావాలన్నది కలగన్నదని పేర్కొంది. ఈ డాక్టరేట్ డిగ్రీతో ఇద్దరి కల సాకారమైనట్లు తాను భావిస్తున్నానని చెప్పింది.
మోకాలి గాయంతో రియో ఒలింపిక్స్‌లో తాను సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయానని తెలిపింది. క్రీడల పరంగా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించింది. భారత్ తరుపున సైనా నెహ్వాల్ మూడు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు రజత పతకం గెలిచింది.
ఈ ఏడాది ఆగస్టులో మోకాలి గాయం కారణంగా ఆమెకు సర్జరీ చేశారు. దాని నుంచి కోలుకోవడంతో తిరిగి ప్రాక్టీసు మొదలుపెట్టింది. స్వాతకోత్సవం అనంతరం మంగళవారం నుంచి తాను ట్రైనింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.