
ఆమె కరాటే కోచింద్ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇన్‌స్ట్రక్టర్ విద్యార్థుల చేతుల మీంచి మోటార్ బైక్ నడిపించడానికి సిద్ధపడడంతో ఆమె కరాటే శిక్షణ నిలిచిపోయింది. "సైనా నెహ్వాల్: స్ఫూర్తిదాయకమైన జీవితకథ" అనే పేరుతో టి. సుధీర్ అనే జర్నలిస్టు రాసిన పుస్తకంలో ఆ విషయం చెప్పారు.
చేతుల మీంచి బైక్ నడిపించడానికి సైనా తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఆమెను వారు వెంటనే అక్కడి నుంచి తప్పించేశారు. కరాటేలో నష్టపోయింది సైనా బాడ్మింటన్‌లో పొందారు. శాకాహారం మాత్రమే తీసుకునే కుటుంబంలో జన్మించిన సైనా చైనాలో ఉన్నప్పుడు 2005లో మాంసాహారిగా మారిపోయారు. రెస్టారెంట్‌లో శాకాహారం లభించకపోవడంతో చేపలు, పీతలు తినాలని సూచించినట్లు ఆమె కోచ్ గోపిచంద్ చెప్పారు.
మాంసాహారం భుజించాలని చెప్పినప్పుడు సైనా ఏ మాత్రం వాదించలేదట. దీనికి తాను ఆశ్చర్యపోయానని గోపిచంద్ అన్నారు. మారు మాట్లాడకుండా మాంసాహారం తినేసిందట. ఇప్పటికీ తనకు మాంసాహారం అంటే ఇష్టం లేదని సైనా ఆ పుస్తకంలో చెప్పింది. చేపలు, మేకమాంసం కాకుండా చికెన్ తింటుందట. రజ్మా, దాల్, రోటీ మాత్రమే ఎక్కువగా తింటుంది.
సైనా తన టీన్స్‌లో బాడ్మింటన్ కోచింద్ కోసం ప్రతి రోజు 25 కిలోమీటర్ల దూరం వెళ్లేదని ఆ పుస్తకంలో చెప్పారు. ఉదయం 4 గంటలకు లేచి, తండ్రి స్కూటర్ మీద వెళ్లేది. నిద్రతో ఆమె తండ్రి వెనక సీటు మీద జోగుతూ ఉండేది. 2000 మార్చిలో ఆమె కోసం కారు కొన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్)లో ఉద్యోగం చేసే హర్వీర్ సింగ్‌కు నెలకు 12 వేల రూపాయల జీతం వచ్చేది.