
హైదరాబాద్: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌కి చెందిన పోర్న్‌పావీతో తలపడిన సైనా నెహ్వాల్ 21-7, 21-18 తేడాతో అలవోక విజయాన్ని సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సైనా నెహ్వాల్ కేవలం 33 నిమిషాల్లోనే గేమ్‌ని సొంతం చేసుకుంది. తొలి సెట్‌ని నిమిషాల వ్యవధిలోనే ముగించిన సైనా.. రెండో సెట్‌లో మాత్రం పోర్న్‌పావీ కాస్త ప్రతిఘటన చూపింది. ఆఖర్లో పుంజుకున్న సైనా, అలవోకగా సెట్‌ని ముగించి గేమ్‌ని సొంతం చేసుకుంది.