Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండోనేసియా మాస్టర్స్‌: టైటిల్‌కు అడుగు దూరంలో సైనా నెహ్వాల్‌

Saina Nehwal enters Indonesia Masters final

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్‌ ఈ సీజన్‌లో తొలి టైటిల్‌కు చేరువైంది. ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సైమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 18-21, 21-12, 21-18 తేడాతో ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించింది.

తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా నెహ్వాల్ ఆపై వరుసగా రెండు గేమ్‌లు సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. బింగ్‌జియావోతో జరిగిన 58 నిమిషాల పోరాటంలో సైనా ప్రదర్శన ఆకట్టుకుంది. చెరోగేమ్ గెలిచిన తర్వాత నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 6-3 ఆధిక్యంతో మొదలైన సైనా దూకుడు క్రమంగా 9-5కు చేరింది.

కానీ సైనా కొట్టిన స్మాష్‌లను బలంగా రిటర్న్ చేసిన జింగ్‌బియావో 10-10, 13-13తో సమం చేసింది. దాంతో మ్యాచ్‌ రసవత్తరంగామారింది. ఈ దశలో సైనా కొన్ని కష్టతరమైన షాట్లు కొడుతూ ఒక్కో పాయింట్‌తో 17-16 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తన అనుభవాన్ని ఉపయోగించి సైనా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను లాగేసుకున్నారు.

మరో సెమీస్‌లో మారిన్‌ 17-21, 21-11, 23-21తో చెన్‌ యుఫె (చైనా)పై నెగ్గింది. దీంతో గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా నెహ్వాల్ టైటిల్ పోరులో ఐదోసీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది.

ఇండోనేసియా మాస్టర్స్‌ ఫైనల్స్‌
ఉదయం గం. 11.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Sunday, January 27, 2019, 11:31 [IST]
Other articles published on Jan 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+