గెట్ వెల్ సూన్: ఆస్పత్రి నుంచి సైనా డిశ్చార్జ్, వైద్యులే షాకయ్యారు!
ముంబై: మహరాష్ట్రలోని ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రి నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ డిశ్చార్జి అయ్యింది. గాయం కారణంగా శనివారం కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సైనా సోమవారం హైదరాబాద్ రానుంది.
ఆదివారమే కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సైనా మరో రోజు ముంబైలోనే ఉండి అంధేరి ఆస్పత్రిలో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సైనా పూర్తి స్థాయి విశ్రాంతి కోసం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేయనుంది.
రియో ఒలింపిక్స్‌కు పది రోజుల ముందు ప్రాక్టీస్ సెషన్‌లో సైనా గాయపడింది. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ అలాగే రియోలో పాల్గొన్న సైనా తొలిరౌండ్లోనే వెనుదిరిగింది. శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధపడిన సైనా.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరింది.
ఆదివారం ఉదయమే సైనా డిశ్చార్జ్ అయ్యిందని, ఆమె నడుస్తోందని, నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో మూడు నుంచి నాలుగు నెలల పూర్తి స్థాయి విశ్రాంతి అనంతరం సైనా ఆటపై దృష్టి పెట్టనుంది.
వైద్యుల ఆశ్చర్యం
సైనా నెహ్వాల్ తీవ్ర మోకాలి గాయంతోనే ఒలింపిక్స్‌లో పోటీ పడటంపై ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత నొప్పితో ఎవరూ కూడా ఆడేందుకు సహసం చేయరని, సైనా మాత్రం ఒలింపిక్స్ ఆడటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.
ఆ నొప్పిని భరించడం మామూలు విషయం కాదని అన్నారు. ప్రస్తుత శస్త్ర చికిత్స అనంతరం మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటే తప్ప ఆమె... మళ్లీ మామూలుగా ఆడే అవకాశం లేదని చెప్పారు.

ఆస్పత్రిలో సైనా నెహ్వాల్
మహరాష్ట్రలోని ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రి నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ డిశ్చార్జి అయ్యింది. గాయం కారణంగా శనివారం కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సైనా సోమవారం హైదరాబాద్ రానుంది.

విరిగిన మోకాలి ఎముక
ఆదివారమే కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సైనా మరో రోజు ముంబైలోనే ఉండి అంధేరి ఆస్పత్రిలో మరోసారి వైద్య పరీక్షలు చేయించుకుంది.

అంతా ఓకే
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సైనా పూర్తి స్థాయి విశ్రాంతి కోసం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేయనుంది. రియో ఒలింపిక్స్‌కు పది రోజుల ముందు ప్రాక్టీస్ సెషన్‌లో సైనా గాయపడింది.

వైద్యులే షాకయ్యారు
తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ అలాగే రియోలో పాల్గొన్న సైనా తొలిరౌండ్లోనే వెనుదిరిగింది. శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధపడిన సైనా.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications