Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌లో సైనా ఓటమి, కాంస్యంతో సరి

హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య సెమీస్‌లోకి అడుగుపెట్టిన సైనా తొలి గేమ్‌లో దూకుడు ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిగేమ్‌లో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-12 తేడాతో సైనా గెలుపొందింది.

Saina Nehwal

ఆ తర్వాత వరుస గేముల్లో 17-21, 10-21తో వరుస గేముల్లో ఓటమి పాలైంది. తొలుత రెండో గేమ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ సమానమైనప్పటికీ చివరికి ఒకుహరనేపై చేయిగా నిలిచి 21-17 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఒకుహర మొదటి నుంచీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడో గేమ్‌లో సైనాపై 21-10 పాయింట్లతో ఒకుహర విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో స్కాట్లాండ్‌ క్రీడాకారిణి గిల్‌మార్‌పై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+