మలేషియా ఓపెన్‌లో సైనా ఓటమి: టోర్నీ నుంచి నిష్క్రమణ

హైదరాబాద్: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 15-21, 13-21 తేడాతో యమగూచి(జపాన్) చేతిలో పరాజయం పాలైంది.
దీంతో సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 34 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఈ పోరులో యమగూచి చెలరేగి ఆడింది. రెండు గేమ్‌ల్లో యమగూచి ఆధిపత్యం ప్రదర్శించింది. సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
34 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రెండు వరుస సెట్లలో సైనా 15-21, 13-21 తేడాతో యమగూచి చేతిలో ఓడింది. వీరిద్దరూ ముఖాముఖి పోరులో ఇప్పటివరకూ ఆరుసార్లు తలపడగా యమగూచి ఐదుసార్లు విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే సైనా గెలుపొందింది.
మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు... మలేసియా క్రీడాకారిణి యింగ్ యింగ్ లీతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications