Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన.. ఏడేళ్ల బంధానికి ముగింపు

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోవాలనే నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహబంధానికి ముగింపు పలుకుతున్నట్లు సైనా సోషల్ మీడియాలో వెల్లడించారు.జులై 13 ఆదివారం అర్ధరాత్రి సైనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వారిద్దరి దారులు ఇప్పుడు వేరయ్యాయి. సైనా, కశ్యప్ ప్రేమ కథ బ్యాడ్మింటన్ కోర్టులో మొదలైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. అక్కడి నుంచే వారి ప్రయాణం కూడా మొదలైంది.

సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విడాకుల విషయాన్ని తెలియజేశారు. ఆమె ఇలా రాసుకొచ్చారు. "కొన్నిసార్లు జీవితం మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచనలు, చర్చల తర్వాత, నేను, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము శాంతి, ఎదుగుదల, మానసికంగా ఆరోగ్యకరమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. గడిచిన క్షణాలకు నేను కృతజ్ఞురాలిని. కశ్యప్‌కు తదుపరి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ సమయంలో మా గోప్యతను గౌరవించండి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు." అంటూ సైనా ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.

Saina Nehwal Announces Separation from Parupalli Kashyap After 7 Years of Marriage

సైనా నెహ్వాల్ భారత మహిళా బ్యాడ్మింటన్‌లో మొదటి సూపర్ స్టార్. ఆమె 2008 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కాగా 38 ఏళ్ల పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ 1997లో ఒక బ్యాడ్మింటన్ క్యాంపులో కలుసుకున్నారు. కానీ 2002లో హైదరాబాద్‌లో కలిసి శిక్షణ ప్రారంభించినప్పుడు వారు క్రమం తప్పకుండా కలుసుకోవడం మొదలు పెట్టారు.

2004లో భారత ప్రముఖ జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పులెల్ల గోపిచంద్ తన బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించినప్పుడు వీరిద్దరూ ఆయన వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలోనే2004 ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ల కోసం వారు సిద్ధమవుతున్నప్పుడు వారిద్దరి మధ్య సంబంధం మొదలైంది. వారు డేటింగ్ ప్రారంభించారు. కాగా వీరిద్దరు 2018లో పెళ్లి చేసుకున్నారు.

Story first published: Monday, July 14, 2025, 8:26 [IST]
Other articles published on Jul 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+