హైదరాబాద్: ఎక్కువ కాలం నెంబర్ వన్ స్థానంలో ఉండటం అంత సులభం కాదు.. అయితే స్టార్ భారత షట్లర్ సైనా నెహ్వాల్ మాత్రం తాను చాలా కాలం టాప్ పొజిషన్లో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. నెంబర్ వన్ స్థానంలో ఎక్కువ రోజులు ఉండటం చాలా కష్టమేనని, అయితే దానిని చాలా రోజులు ఉంచుకుంటానని చెప్పారు.
ఇందుకోసం తాను మరింత కృషి చేస్తానని చెప్పారు. భారత్ తరఫున నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న మహిళను తానే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతా సవ్యంగా ఉంటే, తన శిక్షణ బాగుంటే తాను తప్పకుండా ఇదే స్థానంలో కొనసాగుతానని చెప్పారు.

ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. నేను ప్రపంచ నెంబర్ వన్ అనే విషయాన్ని ఎప్పటికీ మదిలో ఉంచుకుంటానని, అందుకు అనుగుణంగా కష్టపడతానని చెప్పారు. నా దేశం కోసం మరెన్నో టైటిల్స్ నెగ్గేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.
తన నెంబర్ వన్ పొజిషన్‌కు ఏ క్రీడాకారిణి నుండి అయినా త్రెట్ ఉందని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి తాను ఎవరి పైన కామెంట్ చేయనని చెప్పారు. ముఖ్యంగా లీ జీరీ ప్రధాన పోటీగా ఉందననారు. ఆమె ఇతరుల కంటే తక్కువ టోర్నమెంట్స్ ఆడారన్నారు.