Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలేసియా ఓపెన్: క్వార్టర్స్‌లోకి సైనా నెహ్వాల్

Saina enters quarters of Malaysia Masters, runs into Okuhara next

హైదరాబాద్: కౌలాలంపూర్‌ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లోకి ప‍్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో సైనా నెహ్వాల్‌ 21-14, 21-16 తేడాతో యిప్‌ పుయ్‌ యిన్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది.

కేవలం 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా, రెండో గేమ్‌లో మాత్రం కాస్త పోరాడి గెలవడం విశేషం. శుక‍్రవారం జరుగనున్న క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ఒకుహారా(జపాన్‌)తో సైనా తలపడనుంది.

వీరిద్దరి ముఖాముఖి రికార్డులో సైనా 8-4తో ముందంజలో ఉంది. గతేడాది జరిగిన రెండు వరుస టోర్నమెంట్లలో(డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌) ఒకుహారాపై సైనా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, January 17, 2019, 14:25 [IST]
Other articles published on Jan 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+