Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయంతో వైదొలిగిన మారిన్: ఇండోనేసియా మాస్టర్స్ విజేతగా సైనా

Saina claims Indonesia Masters title after injured Marin limps out of final

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తొలి గేమ్‌లోనే కాలి గాయంతో తప్పుకుంది. ఈ ఏడాది సైనాకి ఇదే తొలి టైటిల్. టైటిల్ విజేత సైనాకు 26, 250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 61 వేలు) లభించింది.

2018లో ఇదే టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా... ఇప్పుడు విజయం అందుకుంది. గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే మోకాలి గాయం కారణంగా కోర్టులోనే కుప్పకూలిపోయిన మారిన్ కనీసం నిల్చోలేకపోవడంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ని విజేతగా ప్రకటించారు.

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి మారిన్

గత వారమే మలేసియా మాస్టర్స్‌ టోర్నీలో సైనాపై ఘన విజయం సాధించిన మారిన్‌ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మారిన్ సైనా కుదురుకోకముందే 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సైనా ర్యాలీలతో కాస్త పోరాటం చేసినా.. బ్యాక్‌లైన్ గేమ్‌లో తప్పిదాలు మారిన్ ఆధిక్యాన్ని 6-2కు పెంచాయి.

కోర్టులో అనూహ్యంగా పడిపోయిన మారిన్

దూకుడు పెంచిన మారిన్‌ 9-2తో దూసుకుపోయిన దశలో సైనా షాట్‌ను రిటర్న్ చేసే క్రమంలో అదుపు తప్పి కోర్టులో అనూహ్యంగా పడిపోవడంతో కాలికి గాయమైంది. బలమంతా కుడి కాలు మీద పడటంతో మోకాలు మెలితిరిగింది. మారిన్ నొప్పితో విలవిలలాడింది. చికిత్స అనంతరం ఆమె ఆట కొనసాగించినా నొప్పిని భరించలేకపోయింది.

రెండేళ్ల తర్వాత తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ నెగ్గిన సైనా

మరో మూడు పాయింట్ల తర్వాత ఇక తన వల్ల కాదంటూ కుప్పకూలింది. కానీ, నొప్పి తీవ్రం కావడంతో మ్యాచ్‌ నుంచి వెదొలిగింది. దీంతో స్కోరు 10-4 ఉన్న దశలో మారిన్ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో సైనాను విజేతగా ప్రకటించారు. దీంతో రెండేళ్ల తర్వాత సైనా నెహ్వాల్ తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. చివరిసారి 2017లో మలేషియా ఓపెన్‌ను గెలుచుకుంది.

 టైటిల్‌ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను

టైటిల్‌ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను

సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకూ మారిన్‌తో 11 మ్యాచ్‌ల్లో తలపడిన సైనా నెహ్వాల్ ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. మ్యాచ్ అనంతరం సైనా మాట్లాడుతూ "నేను టైటిల్‌ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను. కఠినమైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌ వరకు వెళ్లడం సంతోషకరం. ఫైనల్లో నేను వెనుకబడ్డాననేది వాస్తవం. అయితే గట్టిగా పోరాడేదాన్ని. దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కోర్టులో ఈ తరహాలో గాయపడటం చాలా బాధాకరం. నాకు కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది కాబట్టి ఆ వేదన ఎలాంటిదో బాగా తెలుసు" అని వ్యాఖ్యానించింది.

Story first published: Monday, January 28, 2019, 8:11 [IST]
Other articles published on Jan 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+