Sai Praneeth Gets Married: షట్లర్ సాయి ప్రణీత్ పెళ్లి ఫోటోలు చూశారా?

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు. కాకినాడలో జరిగిన పెళ్లిలో అతడు లక్ష్మీశ్వేతను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరయ్యారు.
సాయి ప్రణీత్‌ది పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం. శ్వేత జయంతిది కాకినాడ. డిసెంబరు 9న హైదరాబాద్‌లో ప్రముఖుల కోసం విందు నిర్వహించనున్నారు. ఈ పెళ్లితో సాయి ప్రణీత్ తన వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏడాది అర్జున అవార్డు కూడా అందుకున్నాడు.

సాయి ప్రణీత్‌కు ఈ ఏడాది అద్భుతంగా సాగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు 1983లో ప్రకాశ్ పదుకొణె తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిప్ నెగ్గిన భారత రెండో పురుష షట్లర్‌గా ప్రణీత్ నిలిచాడు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించే క్రమంలో సాయి ప్రణీత్ గత వారం బీడబ్లుఎఫ్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు.
Story first published: Monday, December 9, 2019, 9:52 [IST]
Other articles published on Dec 9, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications