For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: బెంగుళూరును హాంఫట్ చేసిన హైదరాబాద్

Sai Praneeth, Carolina Marin take Hyderabad Hunters to top of the standings

హైదరాబాద్: పీబీఎల్‌-3 చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్‌ హంటర్స్‌ చేతిలో బెంగళూరు బ్లాస్టర్స్‌ ఘోర పరాజయం చవిచూసింది. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో హంటర్స్‌ 6-(-1)తో బ్లాస్టర్స్‌ను చిత్తుచేసింది.

తొలి మ్యాచ్‌లో బెర్నాడెత్‌- సాత్విక్‌ సాయిరాజు 15-6, 14-15, 15-9తో సిక్కిరెడ్డి- మనుపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 10-15, 15-7, 15-14తో చాంగ్‌ ఫెంగ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో హంటర్స్‌ సారథి కరోలినా మారిన్‌ 15-9, 15-7తో గిల్మూర్‌పై గెలిచి జట్టుకు 3-0తో ఆధిక్యం అందించింది.

హంటర్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న రెండో పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్‌ 15-11, 11-15, 15-11తో శుభంకర్‌ దేవ్‌పై నెగ్గడంతో హంటర్స్‌ ఆధిక్యంతో 5-0కు పెరిగింది. బ్లాస్టర్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌ పురుషుల డబుల్స్‌లో మార్కిస్‌ కిడొ- యియాన్‌ సియాంగ్‌ 15-10, 11-15, 15-7తో మథియస్‌- కిమ్‌ రాంగ్‌ గెలిచారు.

లీగ్‌ దశ అనంతరం పాయింట్ల పట్టికలో హంటర్స్‌ (20), అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ (17), దిల్లీ డాషర్స్‌ (15), బ్లాస్టర్స్‌ (14) తొలి 4 స్థానాల్లో నిలిచి సెమీస్‌ బెర్తు దక్కించుకున్నాయి. శుక్రవారం తొలి సెమీస్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌.. ఢిల్లీ డాషర్స్‌తో, శనివారం రెండో సెమీస్‌లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌.. బెంగళూరు బ్లాస్టర్స్‌తో తలపడనున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 11:29 [IST]
Other articles published on Jan 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+