
హైదరాబాద్: బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్ 1 సచిన్ మాటలను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనిపై ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా వెలిబుచ్చాడు.
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నం.1 అవుతానని మూడేళ్లక్రితం క్రికెట్ దిగ్గజం సచిన్ అన్నారని శ్రీకాంత్ తెలిపాడు. ఈ మేరకు శ్రీకాంత్ ట్విటర్ వేదికగా సచిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ నం.1 ర్యాంకు సాధించిన సందర్భంగా కిదాంబి సంతోషం వ్యక్తం చేస్తూ ' మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను. 2015లో నేను మిమ్మల్ని కలిసినప్పుడు నన్న ప్రపంచ నం.1 అవుతానని మీరు నాతో అన్నారు. ఆమాటలు నాకు స్ఫూర్తి ఇచ్చాయి. మీ మాటలే ఈ స్థాయికి చేర్చాయి. థాంక్యూ సర్' అని ట్వీట్ చేశారు.
25 ఐదేళ్ల ఈ బ్మాడ్మింటన్ సంచలనం రెండు వారాల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకుల్లో ప్రపంచ నం.1 గా నిలిచారు. భారతీయుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తర్వాత కిదాంబిదే ఈ ఘనత. పురుషుల సింగిల్స్‌లో ఆ ఘనత సాధించిన తొలిభారతీయుడు కూడా ఇతడే కావడం విశేషం. గతేడాది ఇండోనేషియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్ సూపర్ టైటిళ్లు గెలుచుకున్న ఇతడు గత నవంబరులో ప్రకటించిన ర్యాంకుల్లో ప్రపంచ రెండో స్థానాన్ని సంపాదించాడు. నిజానికి గతేడాదే నం.1గా నిలవాల్సి ఉండగా గాయం కారణంగా ఓ టోర్నీకి దూరంకావడంతో ర్యాంకు చేజారింది.
ఈనెల 4 నుంచి 15వరకు ఆస్ట్రే-లియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ రజత పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో భారత్ 26 స్వర్ణ పతకాలు, 20రజత,20 కాంస్య పతకాలను గెలుచుకుంది.