సైనా కశ్యప్‌లను విష్ చేయబోయి శ్రీకాంత్‌ను కలిపిన సచిన్

హైదరాబాద్: క్రీడారంగంలో దాంపత్య బంధంతో ఒకటైన మరో జంట పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌లు. వీరి వివాహం సింపుల్‌గానే ముగిసిపోయినా రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారు. వివాహానంతరం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందుకున్న ఈ జోడీ.. సచిన్ నుంచి ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. శుభాకాంక్షలు చెప్పే క్రమంలో సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా ఓ పొరపాటు చేశాడు. శుక్రవారం ఇషా అంబానీ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సైనా, కిడాంబి శ్రీకాంత్ ఫొటోను అప్‌లోడ్ చేసి సైనా-కశ్యప్ జంటకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.
పొరబాటును గమనించిన సచిన్ ఆ తర్వాత
అంతేకాకుండా దాన్ని పారుపల్లి కశ్యప్‌కు ట్యాగ్ చేశారు. గంటల వ్యవధిలోనే ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది. దానికి స్పందించిన నెటిజన్లు.. సైనా.. కశ్యప్‌ను వివాహం చేసుకొందని శ్రీకాంత్‌ను కాదంటూ కామెంట్లు చేశారు. ఆ పొరబాటును గమనించిన సచిన్ ఆ తర్వాత ట్వీట్‌ను తొలగించాడు.
ఉత్తరాది అభిమానులతో మరో చిక్కొచ్చి
సచిన్ ట్వీట్ వ్యవహారం ఇలా ఉంటే.. పారుపల్లి కశ్యప్‌కు ఉత్తరాది అభిమానులతో మరో చిక్కొచ్చిపడింది. కొంత మంది పారుపల్లి అసలు పేరని, కశ్యప్ ఇంటిపేరని పొరబడుతున్నారు. దీంతో పెళ్లి చేసుకొన్న తర్వాత సైనా ఇంటిపేరుపై చర్చ మొదలుపెట్టారు. దీనిపై కశ్యప్ స్పందిస్తూ.. సైనా పారుపల్లి అని పిలవాలని సూచిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా సైనా, కశ్యప్ వివాహం చేసుకున్నారు. దీంతో భారత బ్యాడ్మింటన్ జంట ప్రేమ వ్యవహారం సుఖాంతమైంది.
బెస్ట్ మ్యాచ్ ఆఫ్ మై లైఫ్
సంప్రదాయ దస్తులు ధరించిన సైనా, కశ్యప్.. ఇరువురి కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్ క్రీడాకారుల సమక్షంలో మ్యారేజ్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి దండలు మార్చుకున్నారు. గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ఆయన సతీమణి విమల నరసింహన్ ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సైనా నివాసముంటున్న ఓరియన్ విల్లాలోని క్లబ్ హౌస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి తర్వాత సైనా, కశ్యప్ ట్విటర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. దండలు మార్చుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘బెస్ట్ మ్యాచ్ ఆఫ్ మై లైఫ్' అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనికి స్పందిస్తూ సెలబ్రిటీలు శుభాకాంక్షల మెసేజ్‌లు పెట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications