For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను ఇంకొన్నేళ్లు ఆడనివ్వండి : ఫెదరర్

Roger Federer wants to play tennis for ‘a few more years’

హైదరాబాద్: ప్రపంచ స్థాయి ర్యాంకర్, ప్రఖ్యాత ఆటగాళ్లలో ఒకడైన రోజర్ ఫెదరర్ తను 2018 వరకే ఆడాలని చేసిన నిర్ణయాన్ని తిరస్కరించాడు. ఫెదరర్ వెన్నునొప్పి, మోకాలి గాయంతో చికిత్స చేయించుకుని కొంత కాలం విశ్రాంతి తీసుకున్నాడు. 2016 తర్వాత తన రెండో ఇన్నింగ్స్ మొదలైంది. అప్పటి నుంచి అద్భుతంగా రాణించి ప్రపంచ స్థాయిలో రెండో ర్యాంకు పొందాడు.
ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్‌లతో కలిపి ఫెదరర్ తిరిగొచ్చాక ఏడు టైటిళ్లను గెలుచుకున్నాడు. తనకు రిటైర్ కావాలని లేకపోయినా ఫిట్ నెస్ లేకపోవడం చేత అతను తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డిజొకొవిక్, ముర్రే, వావిరింకా, నిషికోరి, రావ్‌నిక్ ఎలాగైతే తిరిగి వచ్చి సక్సెస్ గా దూసుకెళ్తున్నారో అదే విధంగా తన ప్రతిభను అందరికీ మరోసారి తెలిసేలా చేస్తానన్నాడు.

"నాకు కొంత కాలం ఆడాలనుంది. అంటే ఇంకొద్ది సంవత్సరాల వరకు ఆడదామనుకుంటున్నాను. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ మ్యాచ్ లలో బాగానే ఆడగలిగాను. నేను 100 శాతం ఫిట్ నెస్ తో ఉంటేనే కోర్టులో అడుగుపెడతాను. " అంటూ తన ఆటపై నమ్మకాన్ని వెలిబుచ్చాడు.

36 ఏళ్ల ఫెదరర్ వచ్చే ఏడాది జరగాల్సిన మ్యాచ్ లలో గట్టి ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంది. టెన్నిస్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించిన మ్యాచ్‌లో ఫెదరర్ సెమీ ఫైనల్ లో ఓడిపోయాడు. మెల్డౌర్న్ పార్క్ ప్రాంతంలో జరగాల్సిన ఆస్ట్రేలియా ఓపెన్ లో జనవరి 15న పాల్గొననున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 13:44 [IST]
Other articles published on Dec 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+