Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ ఓపెన్: సింధు ఓటమి, అభిమానుల నిరాశ

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో ఓటమి పాలైంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ అందుకోవాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి.

ఫామ్‌లోకి పీవీ సింధు: ఫ్రెంచ్ ఓపెన్‌పై గురి

ప్రెంచ్ ఓపెన్ సిరిస్‌లో భాగంగా తొలి రౌండ్లో విజయం సాధించిన సింధు చైనా క్రీడాకారిణి హి బింగ్‌జియో చేతిలో 22-20, 21-17 తేడాతో పరాజయం పాలైంది. దీంతో పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. సింధు వరుసగా రెండు టోర్నీల్లో రెండో రౌండ్‌లోనే వెనుదిరగడం అభిమానులను నిరాశ పరచింది.

Rio Silver medallist PV Sindhu crashes out of French Open

ఇదిలా ఉంటే పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రణయ్‌కి కూడా రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన ఐదో సీడ్ ఆటగాడు చెన్ చౌ చేతిలో 19-21 16-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. స్విస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

కాగా, రియో ఒలింపిక్స్‌లో ఆడిన తర్వాత తొలిసారి డెన్మార్క్ ఓపెన్‌లో ఆడిన ఆమె రెండో రౌండ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+