For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధు ఫైనల్ మ్యాచ్ ఎక్కడ?: ప్రత్యర్ధి ఎవరు, ఏ టీవీ ఛానెల్‌లో ప్రసారం

By Nageshwara Rao

హైదరాబాద్: ఆడుతోన్న తొలి ఒలింపిక్స్‌లోనే పూసర్ల వెంకట సింధు (21) చరిత్ర సృష్టించింది. గురువారం తెల్లవారుజామున రెజ్లర్ సాక్షి మాలిక్‌ కాంస్య పతకంతో మనల్ని పలకరిస్తే, సాయంత్రానికి సింధు తన అద్భుతమైన ఆటతో ఉమెన్స్‌ సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది.

రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగే తుది పోరులోనూ విజయం సాధిస్తే భారత బ్యాడ్మింటన్‌లో సింధు అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా, వెండి పతకంతో కొత్త చరిత్రను సృష్టించడం ఇప్పటికే ఖాయమైపోయింది.

రియోలో గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్స్‌లో వరల్డ్ 10వ ర్యాంక్‌లో సిందు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది.

ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు

ఈ ఫైనల్ మ్యాచ్ రియో సెంట్రో పెవిలియన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే రజతం లేదా స్వర్ణం గెలవనున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలువనుంది. 2000 సిడ్నీలో కరణం మల్లీశ్వరి, 2012 లండన్‌లో మేరీకోమ్ కాంస్య పతకాలను గెలిచారు.

అంతేకాదు వెండి లేదా స్వర్ణం గెలవనున్న తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలవనుంది. గత ఒలింపిక్స్‌ విజేతలంతా కాంస్య పతకానికే పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించిన ఏకైక క్రీడాకారుడు అభినవ్ బింద్రా (2008 బీజింగ్) మాత్రమే. సింధు ఫైనల్స్‌కు చేరిన అనంతరం అభినవ్ బింద్రా తన ట్విట్టర్‌లో గోల్డ్ క్లబ్‌లో చేరాలంటూ సింధును ఆహ్వానించాడు.

Rio Olympics: PV Sindhu's FINAL start time in IST, opponent name, TV channel information


ఫైనల్ ఎక్కడ?
Sindhu Vs Marin gold medal match is on Friday (August 19) at 6.55 PM IST (Rescheduled from 7.30 PM IST)

టీవీలో ఏ ఛానెల్ ప్రసారం చేస్తోంది?
రాత్రి 6:55 నుంచి స్టార్ స్పోర్ట్స్ 2, 3లో ప్రత్యక్షప్రసారం

గతంలో మారిన్‌తో సింధు తలపడిన సందర్భం
4-3 తేడాతో మారిన్ ఆధిక్యంలో ఉంది

18 November 2015 (Hong Kong Open)
Marin won 21-17, 21-9 17

October 2015 (Denmark Open)
Sindhu won 21-15, 18-21, 21-17 24

January 2015 (Syed Modi International Championships)

Marin won 21-13, 21-13 30

August 2014 (BWF World Championships)
Marin won 21-17, 21-15 27

June 2014 (Australian Open)
Marin won 21-17, 21-17

2011 (Maldives International Challenge)

Sindhu won 21-7, 15-21, 21-13 24

April 2010 (World Junior Championships)

Sindhu won 21-17, 21-19

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+