రియో డీ జెనిరో: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు - కరోలినా మారిన్ మధ్య జరిగిన ఫైనల్లో తెలుగు తేజం సిల్వర్‌తో సరిపెట్టుకుంది. కరోలినాకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, ప్రత్యర్థి అనుభవం ముందు వెనుకబడింది. తొలి సెట్ గెలిచిన సింధు.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు కోల్పోయింది.
తొలి సెట్‌ను సింధు 21-19తో కరోలినాపై గెలుచుకుంది. రెండో సెట్‌ను మారిన్ 12-21తో, మూడో సెట్ 15-21తో మారిన్ గెలుచుకుంది. దీంతో స్వర్ణం చేజారింది. రజితం సాధించినా.. సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన ఇండియన్ షట్లర్ సింధు మాత్రమే.
తొలి సెట్ ఉత్కంఠగా.. సింధు గెలుపు
తొలి సెట్ తీవ్ర ఉత్కంఠగా సాగింది. దాదాపు పదిహేను పాయింట్ల వరకు కరోలినా దూసుకెళ్లింది. సింధు వెనుకబడింది. ఇద్దరి మధ్య నాలుగు, ఐదు పాయింట్ల తేడా కనిపించింది. ఆ తర్వాత పీవీ సింధు పుంజుకుంది. కరోలినా మారిన్ 15 పాయింట్ల వద్ద ఉన్నప్పుడు సింధు పుంజుకుంది. ఓ సమయంలో తొలి సెట్ పోతుందేమోనని అనిపించింది.
అనంతరం సింధు పుంజుకోవడంతో 17-16కు వచ్చింది. సింధు ధాటిగా ఆడటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 16-19, 17-19, 18-19, 19-19 .. ఇలా ఉత్కంఠగా సాగింది. చివరలో సింధు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత 20-19తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మరో పాయింట్ సాధించింది. 21-19తో తొలి సెట్‌ను సింధు కైవసం చేసుకుంది.
రెండో సెట్ ఇలా.. మారిన్ గెలుపు
రెండో సెట్‌లోను ఆరంభం నుంచి కరోలినా దూకుడు కనిపించింది. కరోలినా 4 పాయింట్లు సాధించే వరకు సింధు ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. ఆ తర్వాత 5-13తో సింధు వెనుకబడింది. 7-14, 7-14, 8-15, 8-16, 9-16, 9-17, 9-18, 10-18, 11-18, 11-19, 12-19, 12-20, 12-21తో దూసుకెళ్లిన కరోలినా మారిన్.. సింధు పైన గెలిచింది.
మూడో సెట్... ఉత్కంఠగా సింధు గెలుపు
తొలి రెండు సెట్లలో సింధు - మారిన్ చెరొకటి గెలిచారు. తొలి సెట్ సింధు, రెండో సెట్ మారిన్ గెలుచుకుంది. దీంతో మూడో సెట్ మరింత ఉత్కంఠగా మారింది. మూడో సెట్లోను ఆరంభం నుంచి మారిన్ దూకుడు కనిపించింది. 4-7, 4-8, 5-9, 6-9, 7-9, 8-9, 8-10, 9-10, 10-10, 10-11, 10-12, 10-13, 11-14, 11-15, 12-15, 13-16, 14-16, 14-17, 14-18, 14-19, 14-20, 15-20, 15-21తో.. కరోలినా మారిన్ మూడో సెట్ గెలుచుకుంది.
ఆలస్యంగా ప్రారంభం
రియో ఒలింపిక్స్‌లో శుక్రవారం సాయంత్రం గం.6.55 నిమిషాలకు స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తెలుగు తేజం పీవీ సింధు తలపడిన ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. మెన్స్ రెండో సెమీ ఫైనల్ అనంతరం సింధు వర్సెస్ కరోలినా మ్యాచ్ ప్రారంభమైంది.
దటీజ్ సింధు, రికార్డ్‌లు: 'ఒంటరి'కి చెక్ చెప్పేనా: ఎవరు, ఎలా ఎదిగింది?
ఇరువురు ఆరు మ్యాచుల్లో తలపడ్డారు. ఇందులో నాలుగింట కరోలినా, రెండింట సింధు గెలిచింది. ఇప్పుడు ఫైనల్లో గెలవాలని సింధు భావిస్తోంది. ఇద్దరు కూడా 65 కిలోలు ఉంటారు. కరోలినా వయస్సు 23, సింధు వయస్సు 21.

సింధు తన క్రీడా కెరీర్‌లో 184 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 86 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. కరోలినా మారిన్ 239 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 74 మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. మారిన్ విజయాల శాతం 76.36గా ఉండగా, సింధు విజయాల శాతం 67.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
కెరీర్లో మారిన్ 19 టైటిల్స్ సాధించగా, సింధు ఆరు టైటిల్స్ సాధించింది. 21 ఏళ్ల సింధు 65 కేజీల బరువుతో పాటు, 5.8 అడుగుల ఎత్తు కలిగి ఉండగా, 23 ఏళ్ల మారిన్ 65 కేజీల బరువు, 5.6 అడుగుల ఎత్తు ఉంది. సింధు కుడిచేతివాడం. మారిన్ ఎడమ చేతి వాటం. అటాకింగ్ ఆటలో మారిన్ దిట్ట. సింధు ఇప్పుడు పాంలో ఉంది. స్మాష్ షాట్లలో సింధు దిట్ట.