For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017 కిదాంబి శ్రీకాంత్‌దే: సంపాదనలో అగ్రస్ధానం

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ టైటిళ్లు సాధించిన శ్రీకాంత్ (230,423 యూఎస్‌డాలర్లు) 1.54 కోట్ల రూపాయలతో బ్యాడ్మింటన్ ప్లేయర్ల సంపాదన

By Nageshwara Rao
Red-hot Kidambi Srikanth top grosser for this year

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ టైటిళ్లు సాధించిన శ్రీకాంత్ (230,423 యూఎస్‌డాలర్లు) 1.54 కోట్ల రూపాయలతో బ్యాడ్మింటన్ ప్లేయర్ల సంపాదన జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు.

ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో రెండో స్ధానంలొ కొనసాగుతున్న కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరిస్ టైటిళ్లు గెలవడం.. తద్వారా వచ్చిన ప్రైజ్ మనీ శ్రీకాంత్‌ని అగ్రస్ధానంలో నిలబెట్టాయి.

మాజీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్‌ లీ చాంగ్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌, రెండు సూపర్‌ సిరీస్‌ల్లో రన్నరప్‌గా నిలవడంతో 86,275 యూఎస్‌ డాలర్లు (రూ.56 లక్షలు) ఆర్జించాడు. ఇక మహిళల షట్లర్లు అయిన తై జూ యింగ్‌, పీవీ సింధూలకన్న శ్రీకాంత్‌ ఎక్కువగా సంపాదించడం విశేషం.

దీనిపై కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ మాట్లాడుతూ 'భారత బ్యాడ్మింటన్‌కు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్‌ సాధించింది ఓ అద్భుతమైన ఘనత. ఓ భారత్‌ షట్లర్‌ సంపాదనలో అగ్రస్ధానంలో నిలుస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ శ్రీకాంత్‌ ఈ ఘనత సాధించి ఆశ్చర్యానికి గురిచేశాడు' అని అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 18:37 [IST]
Other articles published on Nov 17, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+