పిక్చర్స్: హైదరాబాద్‌లో కోచ్, పేరెంట్స్‌తో సింధు
హైదరాబాద్: మాకావూ ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మంగళవారం హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీకి చేరుకుంది. మకావూ ఎపెన్ గ్రాండ్ ప్రి టోర్నీ టైటిల్ గెలుచుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
గోపీచంద్ అకాడమీలో ఆమెను సహ క్రీడాకారులు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ గోపీచంద్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ ఏడాదిని విజయంతో ముగించడం ఆనందంగా ఉందని సింధు చెప్పింది. ఈ విజయాలను వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇది సింధుకు ఈ ఏడాది రెండో అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పివి సింధు కెనడాకు చెందిన లి మిచెల్లీని ఓడించి ఈ టైటిల్ సాధించింది. రెండు వరుస సెట్లలో సింధు 21-15, 21-12తో మిచెల్లీని ఓడించింది. ప్రస్తుతం పివి సింధు ప్రపంచస్థాయిలో పదకొండవ ర్యాంకులో ఉంది.

ముద్దాడుతూ సింధు ఇలా..
మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ముద్దాడుతూ పివి సింధు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె మంగళవారం గోపిచంద్ అకాడమీకి వచ్చింది.

టైటిల్‌ను ప్రదర్శిస్తూ..
మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను ప్రదర్శిస్తూ గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు ఇలా.

తల్లిదండ్రులతో పివి సింధు..
గోపిచంద్ అకాడమీలో తన తల్లిదండ్రులతో నవ్వుతూ పివి సింధు ఇలా కనిపించింది. వారి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

గోపీచంద్‌తో సింధు ఇలా.
కోచ్ గోపిచంద్‌తో పివి సింధు సంతోషం వెల్లివిరేస్ ముఖంతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. గోపీచంద్ రాష్ట్రం నుంచి పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేస్తున్నారు.

మీడియాతో మాట్లాడుతూ..
కోచ్ గోపీచంద్‌తో మంగళవారం గోపిచంద్ అకాడమీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో పివి సింధు మాట్లాడింది. ఈ ఏడాదిని విజయంతో ముగించడం ఆనందంగా ఉందని ఆమె చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications