రెండోసారి: మలేషియా గ్రాండ్ ప్రి విజేతగా పీవీ సింధు
హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఆమె మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుపొందింది. ఆదివారం జరిగిన తుదిపోరులో పీవీ సింధు 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)పై వరుస సెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను సాధించింది.
ఈ టోర్నీలో తన ఆటతీరుతో ఆకట్టుకున్న పీవీ సింధు, ఫైనల్లో కూడా అదే ఆటతీరును కనబర్చి టైటిల్ విజేతగా నిలిచింది. 32 నిమిషాల పాటు సాగిన వరుస సెట్లలో గెలిచిన సింధుకు క్రిస్టీ గిల్మౌర్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.

తొలి గేమ్‌లో 5-2 తేడాతో సింధు ఆధిక్యం సాధించగా, ఆ తర్వాత అదే ఊపును కొనసాగించి 12-6, 18-10 తేడాతో దూసుకుపోయింది. సెమీఫైనల్లో టాప్‌సీడ్ జి హుయాన్(దక్షిణకొరియా)కు షాకిచ్చిన సింధు ఫైనల్లో ప్రత్యర్థి క్రిస్టీ గిల్మౌర్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది ఐదో గ్రాండ్ ప్రి టైటిల్ కాగా, మలేషియన్ ఓపెన్ గెలవడం రెండోసారి. అంతకుముందు 2013లో సింధు మలేషియన్ ఓపెన్‌ను గెలిచింది. మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు తేజం పీవీ సింధును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications