ట్విట్టర్‌లో అభినందనలు: సింధుకి ప్రైజ్ మనీ ఎంత?
హైదరాబాద్: రియో ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన కెరీర్‌లో తొలిసారి ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించి చరిత్ర సృష్టించింది. ఆదివారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ ఫైనల్లో విజయం సాధించిన సింధు టైటిల్‌తో పాటు 700,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.
రియో పతక విజేత పీవీ సింధు గ్యాలరీ
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు సిల్వర్ పతకం అందించి తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు, తాజాగా చైనా ఓపెన్‌లో అదే జోరుని కొనసాగించింది. అరవై తొమ్మిది నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింధు విజయం సాధించడానికి చాలా తీవ్రంగా శ్రమించింది.

పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో పదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో తన ముఖాముఖి రికార్డును సింధు 3-3 తో సమం చేసింది. ఇదిలా ఉంటే సింధుకు కెరీర్‌లో ఇదే తొలి సూపర్ సిరిస్ కావడం విశేషం.
కాగా, గత ఏడాది డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ఫైనల్‌కు చేరిన సింధు, చైనా క్రీడాకారిణి లీ జ్యుర్ చేతిలో ఓటమి పాలైంది. ఇక రియోలో ఒలంపిక్ పతకం సాధించిన తర్వాత పీవీ సింధు ఆ తర్వాత పాల్గొన్న రెండు టోర్నీల్లో కనీసం రెండో రౌండ్ కూడా దాటక పోవడం విశేషం. చైనా ఓపెన్ సిరిస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించిన సింధుకు పలువురు అభినందనలు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ
తన కెరీర్‌లో తొలిసారి ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు.
సచిన్ టెండూల్కర్
ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపారు.
కేంద్ర మంత్రి బాదల్
చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ని గెలిచిన నేపథ్యంలో పీవీ సింధుకి కేంద్ర మంత్రి బాదల్ అభినందనలు తెలిపారు.
వీవీఎస్ లక్ష్మణ్
చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ని గెలిచిన నేపథ్యంలో పీవీ సింధుకి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలిపారు.
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్
చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీ టైటిల్‌ని గెలిచిన నేపథ్యంలో పీవీ సింధుకి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications