న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెక్ట్స్‌మ్యాచ్‌పై సింధు: ‘గోల్డ్’అంటున్న సింధు పేరెంట్స్, సోదరి(పిక్చర్స్)

హైదరాబాద్: ఒలింపిక్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు పతకాన్ని ఖారారు చేసిన సింధు తల్లిదండ్రులు, సోదరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ కుమార్తె ఫైనల్లో గెలిచి స్వర్ణాన్ని సాధిస్తుందని సింధు తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింధు విజయాలకు కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణే కారణమని వారు చెబుతున్నారు.

ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాకి కోచ్ గోపీచంద్ కారణమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ఎదిగిందని సింధు తల్లిదండ్రులు రమణ, విజయలక్ష్మి పేర్కొన్నారు.

'సింధు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అంచనాలకు మించి రాణించి పతకం ఖాయం చేసుకుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. తన మ్యాచ్ కోసం దేశం అంతా ఎదురుచూసింది. రోజు రోజుకూ ఆట మెరుగుపడుతోంది. ఫైనల్లో గెలుస్తుందని ఆశిస్తున్నాం' అని సింధు తండ్రి రమణ అన్నారు.

సింధు తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'మధ్యాహ్నమే ఫోన్లో మాట్లాడా. ఆహారం, విశ్రాంతి గురించి మాత్రమే అడిగా. మ్యాచ్ గురించి మాట్లాడితే టెన్షన్ పడుతుంది. సింధు స్వర్ణం సాధించాలని దేశం అంతా కోరుకుంటోంది. చిన్నప్పుడు మ్యాచ్ ఓడిపోతే ఏడ్చేది. ఇప్పుడు కూడా ఓడపోతే దిగాలుగా ఉంటుంది. సింధు కెరీర్‌లో ఏ ఘనత సాధించినా అది గోపీచంద్ పుణ్యమే' అని చెప్పుకొచ్చారు.

కాగా, రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటనలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో ప్రవేశించిన తెలుగుతేజం పీవీ సింధు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆ స్థాయికి ఎదిగిందని ఆమె సోదరి దివ్య తెలియజేసింది. నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సింధు సోదరి దివ్య తన అక్క ఆటను సహచరులతో కలిసి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వీక్షించానని చెప్పింది.

సింధు ఫైనల్స్‌లో అడుగు పెట్టిన క్షణంలో అందరికీ స్వీట్లు, కేక్‌లు పంచి పెడుతూ దివ్య తన ఆనందాన్ని పంచుకుంది. అనంతరం ఇక్కడి చిల్డ్రన్స పార్కు వద్ద గల గూడూరు సీఐ శ్రీనివాసులుకు, ఆయన కుటుంబసభ్యులతో సంబరాలు చేసుకుంది.

ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ.. సింధు విజయం వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ, కష్టం, ఏక్రాగత ఉందని తెలిపింది. తన సోదరి సింధు ఈ విజయం సాధించడానికి తమ తల్లిదండ్రులు, గోపీచంద్ ప్రోత్సాహమే కారణమని చెప్పారు.

రోజూ పది కిలోమీటర్లు రన్నింగ్‌తోపాటు గంటల తరబడి సాధన చేయిస్తూ తన స్తోమత కంటే మించిన విధంగా సింధును గొప్ప బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా తయారు చేశారంది. ఈ విజయం ఏ ఒక్కరిదీ కాదని భారతదేశ ప్రజలందరిదని ఆమె పేర్కొంది. తుదిపోరులో సింధు స్వర్ణపతకం సాధిస్తుందని దివ్య ఆశాభావం వ్యక్తంచేసింది.

నెక్ట్స్ మ్యాచ్ గెలవాలి: సింధు

'నెక్ట్స్‌ మ్యాచ్‌ గెలవాలి'.. ప్రతి మ్యాచ్‌ తర్వాత ఇదే నా టార్గెట్‌' అని సింధు పేర్కొంది. 'ఇక్కడిదాకా వస్తాననుకోలేదు. ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ వచ్చాను. ఇక... ఒక్క మ్యాచ్‌... ఒక ఒకే ఒక్క మ్యాచ్‌! ఇప్పుడు... నా టార్గెట్‌ గోల్డ్‌ మెడల్‌! గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడతా! నా సత్తా మొత్తం చూపిస్తా! విజయావకాశాలు కచ్చితంగా నావైపే ఉన్నాయనే నమ్మకముంది' అని సింధు తెలిపింది.

'ఒత్తిడి వంటిదేమీ లేదు. నా శక్తిని వందశాతం ఉపయోగించడమే ఇక్కడ ముఖ్యం. ఫైనల్స్‌ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. కరోలినా మారిన్‌ నిజంగా బలమైన ప్రత్యర్థి. ఆమె బాగా ఆడుతోంది. అయితే... ఫైనల్స్‌లో ఎవరు బాగా ఆడతారన్నదే విజయాన్ని నిర్దేశిస్తుంది. మారిన్‌ ఎడమ చేత్తో ఆడుతుంది. ఫైనల్స్‌కు సంబంధించి కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చెప్పిన వ్యూహాలను అనుసరిస్తా' అని - సింధు పేర్కొంది.

సింధు పేరెంట్స్ ఆనందం

సింధు పేరెంట్స్ ఆనందం

ఒలింపిక్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు పతకాన్ని ఖారారు చేసిన సింధు తల్లిదండ్రులు, సోదరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ కుమార్తె ఫైనల్లో గెలిచి స్వర్ణాన్ని సాధిస్తుందని సింధు తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింధు విజయాలకు కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణే కారణమని వారు చెబుతున్నారు.

సింధు పేరెంట్స్ ఆనందం

సింధు పేరెంట్స్ ఆనందం

ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాకి కోచ్ గోపీచంద్ కారణమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ఎదిగిందని సింధు తల్లిదండ్రులు రమణ, విజయలక్ష్మి పేర్కొన్నారు.

సింధు పేరెంట్స్ ఆనందం

సింధు పేరెంట్స్ ఆనందం

‘సింధు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అంచనాలకు మించి రాణించి పతకం ఖాయం చేసుకుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. తన మ్యాచ్ కోసం దేశం అంతా ఎదురుచూసింది. రోజు రోజుకూ ఆట మెరుగుపడుతోంది. ఫైనల్లో గెలుస్తుందని ఆశిస్తున్నాం' అని సింధు తండ్రి రమణ అన్నారు.

సింధు పేరెంట్స్ ఆనందం

సింధు పేరెంట్స్ ఆనందం

సింధు తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నమే ఫోన్లో మాట్లాడా. ఆహారం, విశ్రాంతి గురించి మాత్రమే అడిగా. మ్యాచ్ గురించి మాట్లాడితే టెన్షన్ పడుతుంది. సింధు స్వర్ణం సాధించాలని దేశం అంతా కోరుకుంటోంది. చిన్నప్పుడు మ్యాచ్ ఓడిపోతే ఏడ్చేది. ఇప్పుడు కూడా ఓడపోతే దిగాలుగా ఉంటుంది. సింధు కెరీర్‌లో ఏ ఘనత సాధించినా అది గోపీచంద్ పుణ్యమే' అని చెప్పుకొచ్చారు.

సింధు పేరెంట్స్ ఆనందం

సింధు పేరెంట్స్ ఆనందం

రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటనలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో ప్రవేశించిన తెలుగుతేజం పీవీ సింధు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆ స్థాయికి ఎదిగిందని ఆమె సోదరి దివ్య తెలియజేసింది. నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సింధు సోదరి దివ్య తన అక్క ఆటను సహచరులతో కలిసి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వీక్షించానని చెప్పింది.

సింధు పోరాటం

సింధు పోరాటం

సింధు ఫైనల్స్‌లో అడుగు పెట్టిన క్షణంలో అందరికీ స్వీట్లు, కేక్‌లు పంచి పెడుతూ దివ్య తన ఆనందాన్ని పంచుకుంది. అనంతరం ఇక్కడి చిల్డ్రన్స పార్కు వద్ద గల గూడూరు సీఐ శ్రీనివాసులుకు, ఆయన కుటుంబసభ్యులతో సంబరాలు చేసుకుంది.

సింధు పోరాటం

సింధు పోరాటం

ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ.. సింధు విజయం వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ, కష్టం, ఏక్రాగత ఉందని తెలిపింది. తన సోదరి సింధు ఈ విజయం సాధించడానికి తమ తల్లిదండ్రులు, గోపీచంద్ ప్రోత్సాహమే కారణమని చెప్పారు.

సింధు పోరాటం

సింధు పోరాటం

రోజూ పది కిలోమీటర్లు రన్నింగ్‌తోపాటు గంటల తరబడి సాధన చేయిస్తూ తన స్తోమత కంటే మించిన విధంగా సింధును గొప్ప బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా తయారు చేశారంది. ఈ విజయం ఏ ఒక్కరిదీ కాదని భారతదేశ ప్రజలందరిదని ఆమె పేర్కొంది. తుదిపోరులో సింధు స్వర్ణపతకం సాధిస్తుందని దివ్య ఆశాభావం వ్యక్తంచేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X