
లక్నో: కొద్ది నెలలుగా ఫామ్ కోల్పోయిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవి సింధు ఆటకు మెరుగులు దిద్దేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఈ క్రమంలోనే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి సైతం తప్పుకుంది. సమయాబావం వల్లనే ఈ నిర్ణయం తీసకున్నట్లు వెల్లడించింది. డిసెంబరు నెలలో చైనాలో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌పై దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అనుమతి కోసం బాయ్‌కు లేఖ రాసిందని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. నిర్వాహకులతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 12 నుంచి 16 వరకు జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు గ్వాంగ్జ్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్ అంతగా రాణించలేకపోతున్న సింధు.. తొలి రౌండ్లేనే నిష్కమిస్తున్నా.. ఇటీవల ముగిసిన హాంకాంగ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే పరాజయం పాలై వెనుదిరిగింది.
ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న పీవీ సింధు నిచ్సాన్ జిండాల్‌పై 21-15, 13-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధు చేతిలో నిచ్సాన్ జిండాల్‌కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. తాజా విజయంతో పీవీ సింధు రెండో రౌండ్‌లోకి అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా పీవీ సింధు రెండో రౌండ్‌లో కొరియాకు చెందిన సుంగ్ జీ హుయాన్ చేతిలో ఓడిపోయింది.
గతంలో కామన్వెల్త్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో రజత పతకాలతో సత్తా చాటింది. ఇండియా, థాయ్‌లాండ్ ఓపెన్‌లలో ఫైనల్‌కు, ఆల్‌ఇంగ్లండ్‌లో సెమీస్‌కు వచ్చింది. ఈ ఏడాది జులైలో ఇండోనేషియా ఓపెన్, అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో బింజియో చేతిలో పీవీ సింధు ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడో సీడ్ సింధు ఈ సీజన్‌లో మూడు పతకాలను గెలిచింది.