
హైదరాబాద్: థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌పై ఆశలతో బరిలోకి దిగిన తెలుగుతేజం సింధుకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహర చేతిలో 15-21, 18-21 తేడాతో సింధు ఓడిపోయింది. జపాన్ క్రీడాకారిణి, టెక్నిక్ పరంగా తనకన్నా మెరుగైన నజోమీ ఒకుహర చేతిలో 21-15, 21-18 తేడాతో వరుస గేముల్లో ఓటమి పాలైంది.
50 నిమిషాల పాటు పోరాడినా.. ఒకుహర అటాకింగ్ ప్లే ముందు సింధు నిలవలేకపోయింది. తొలి గేమ్‌లో మొదటి నుంచీ వెనుకబడి పోయినా.. రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు ఒక దశలో పరవాలేదనిపించింది. అయితే ఒకుహర మరోసారి అటాకింగ్‌కు దిగడంతో గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు గేముల్లోనూ ఒకుహర ఆధిక్యంలోనే కొనసాగింది. తొలిగేమ్‌లో 6-3తో ముందంజలో ఉన్న ఆమెను చేరుకునేందుకు సింధు తీవ్రంగా పోరాడింది.
18-18 దగ్గర స్కోరు సమమైన సమయంలో వరుసగా మూడు పాయింట్లు కొట్టిన ఒకుహర గేమ్‌తోపాటు మ్యాచ్ కూడా గెలిచింది. గేమ్ మొత్తంలో ఒకుహర రెండు పాయింట్ల ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చింది. 18-15తో ఉన్న ఆమె వరుసగా 5 పాయింట్లు సాధించి తొలి గేమ్ కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో తొలుత 6-2తో సింధు ఆధిపత్యం కొనసాగించింది.
ఈ క్రమంలో పుంజుకున్న ఒకుహర 7-7, 9-9, 14-14, 18-18తో ఆమె ఆధిక్యాన్ని సమం చేస్తూ వచ్చింది. చివర్లో సింధును ఒత్తిడిలోకి నెట్టేసి 21-18తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచింది. వీరిద్దరూ ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా ఒకుహర 6 గెలిచింది.