Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధు షాట్లకు మారిన్ హడల్.. వైరల్ గా గతేడాది వీడియో

రియో డీ జెనిరో : రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ సాధించిన పతకం భారత్ ను మురిపిస్తే.. స్వర్ణానికి ఇంకో అడుగు దూరంలో ఉన్న సింధు సెమీస్ విజయం యావత్తు భారతావనిని పులకింపజేసింది. ప్రస్తుతం దేశమంతటా సింధు పేరు మారుమోగుతుండగా.. ఫైనల్ లోను సత్తా చాటి భారత్ కు స్వర్ణం అందించాలని భారతీయులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు

సెమీస్ మ్యాచ్ లో 21-19, 21-10 తేడాతో జపాన్ ప్రత్యర్థి నోజోమీని కంగు తినిపించిన సింధు.. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ క్రీడాకరిణి కరోలినా మారిన్ తో తలపడనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ నంబర్.1 ర్యాంకు హోదాలో ఉన్న మారిన్ తో గెలుపు అంత సులువేమి కాకపోయినా..! గతేడాది వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ ను పరిశీలిస్తే మాత్రం.. సింధుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపించక మానదు.

గతేడాది డెన్మార్క్ ఓపెన్ లో సింధు మారిన్ మధ్య జరిగిన మ్యాచ్ లో సింధు తనదైన షాట్స్ తో మారిన్ ను బెంబేలెత్తించింది. నేడు వీరిద్దరి మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ మ్యాచ్ కు సంబంధించిన హైలైట్స్ అన్నీ జాతీయ మీడియాలో ఇప్పుడు ప్రధానాంశాలుగా మారాయి. అప్పటి ఫైనల్ లో సింధు చేతిలో మారిన్ పూర్తిగా చతికిలబడడాన్ని బట్టి చూస్తే.. నేటి మ్యాచ్ లో ఈ తెలుగు తేజం స్వర్ణాన్ని ముద్దాడడం ఖాయంగానే కనిపిస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+