వరల్డ్ చాంపియన్‌షిప్: 'పతకం రంగు మారుస్తా'
హైదరాబాద్: గ్లాస్గో వేదికగా సోమవారం ప్రారంభమైన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చెప్పింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గతంలో రెండుసార్లు పతకం గెలిచిన ఏకైక భారత షట్లర్ పీవీ సింధు.
సింధు రెండు సార్లు కాంస్య పతకాన్నే గెలవడం విశేషం. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తాను ఈసారి పతకం రంగు మారుస్తానని ధీమా వ్యక్తంచేసింది. 'ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడి రెండు నెలలైంది. దీంతో ప్రాక్టీస్‌కు తగిన సమయం లభించింది. మంచి ఫామ్‌లో కూడా ఉన్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తానని ఆశిస్తున్నా' అని చెప్పింది.

'పతకంపైనే నా గురి. అయితే ఈసారి నేను పతకం రంగు మార్చాలనుకుంటున్నా. కాంస్యం కన్నా మెరుగైన పతకం సాధించాలనుకుంటున్నా' అని సింధు వివరించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ తొలి రౌండ్‌లో పీవీ సింధుకి బై లభించడంతో రెండో రౌండ్‌లో కిమ్ హయో మిన్ (కొరియా)తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications