వరల్డ్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. జకార్తాలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో లండన్ ఒలంపిక్ ఛాంపియన్ మూడో సీడ్ క్రీడాకారిణి లీ జురైపై సంచలన విజయం సాధించింది.
ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి లీ జురైపై 21-17, 14-21, 21-17 తేడాతో విజయం సాధించింది. పీవీ సింధు కెరీర్‌లో ఆమెకు ఇదే అతి పెద్ద విషయం. 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పదకొండవ సీడ్ ప్లేయర్ సింధు తొలి, మూడు సెట్లను అలవోకగా గెలిచింది. దీంతో బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించింది.

గత రెండు ఛాంపియన్ షిప్‌లలో కాంస్య పతకాలా సాధించిన పీవీ సింధు ఈ ఏడాది కూడా పతకం నెగ్గాలా కనబడుతోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. అందుకు కారణం స్పెయిన్‌కు చెందిన క్రీడాకారిణి , ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ కరోలినా లేదా చైనాకు చెందిన ప్లేయర్ వాంగ్ షిగ్జేయిన్‌తో సెమీస్‌లో తలపడాల్సి వస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications