Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిల్వర్ మెడల్‌తో హృదయాలను గెలిచిన సింధు: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

రియో డీ జనీరో: తాను పాల్గొన తొలి ఒలింపిక్స్‌లోనే భారత్‌కు రజత పతకం సాధించిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

ఈ మ్యాచ్‌లో సింధు 21-19, 12-21, 15-21తో స్పెయిన్‌కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో పోరాడి ఓడి భారత్‌కు రజత పతకాన్ని అందించింది. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.

సింధు, కరోలినా మారన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ సుదీర్ఘంగా మూడు సెట్ల పాటు సాగింది. తొలి సెట్‌ను కైవసం చేసుకున్న సింధు, ఆఖరి క్షణాల్లో ఒత్తిడిని అధిగమించలేక ఆ తర్వాత రెండు సెట్లను కోల్పోయిన భారత్‌కు రజత పతకాన్ని అందించింది. దీంతో ఒలింపిక్స్‌లో రతజం గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా అవతరించింది.

PV Sindhu settles for silver medal, wins hearts: Who said what on Twitter

గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004), విజయ్ కుమార్ (2012), సుశీల్ కుమార్ (2012)లు ఈ ఘనతను సాధించారు. అలాగే భారత ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన ఐదో క్రీడాకారిణిగా సింధు రికార్డులకెక్కింది. అంతేకాదు రతజం గెలిచిన తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

అంతక ముందు సిడ్నీ ఒలింపిక్స్ (2000)లో కరణం మల్లీశ్వరి, లండన్ ఒలింపిక్స్‌ (2012)లో సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీకోమ్, తాజాగా రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్‌లు కాంస్య పతకాలను సాధించారు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం అందించిన సింధుపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిసింది.

సింధుపై ట్విట్టర్‌లో ఎవరెవరు ఏమన్నారంటే?

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+