గోపీచంద్ అకాడమీ వీడటంతోనే మెడల్ సాధించా: పీవీ సింధు

టోక్యో: భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపిచంద్ అకాడమీ వీడటంతోనే తాను ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధిచగలిగానని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఆదివారం జరిగిన బ్రాంజ్ మెడల్ ఫైట్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో చైనా ప్లేయర్ హి బింగ్జియావోను చిత్తు చేసింది. దాంతో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డుకెక్కింది.

సెమీఫైనల్లో ఓడినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదలతో ఆడి బ్రాంజ్ మెడల్ పోరులో ఘన విజయాన్ని అందుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. మెడల్ సాధించిన సింధు, కోచ్‌తో కలిసి ఈ(సోమవారం) ఉదయం వర్చువల్‌గా మీడియా సమావేశంలో పాల్గొంది.

నేను చేసిన మంచి పనదే..

నేను చేసిన మంచి పనదే..

గోపిచంద్ అకాడమీ వీడి గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఒలింపిక్స్ సన్నాహకాల్లో తాను తీసుకున్న గొప్ప నిర్ణయం కూడా ఇదేనని పేర్కొంది. ‘మా మధ్య ఎలాంటి విబేధాలు(గోపిచంద్‌తో) లేవు. గచ్చిబౌలి ఓ అంతర్జాతీయ స్టేడియం. అక్కడి పరిస్థితులు అచ్చం ఒలింపిక్స్‌ల్లో ఉన్నట్లే ఉంటాయి. టోక్యోలో డ్రిఫ్ట్ కీలక పాత్ర పోషించింది. షాట్స్‌ను అంచనా వేయడంలో గచ్చిబౌలీ మైదానం ప్రాక్టీస్ కలిసొచ్చింది. మా నిర్ణయాలన్నీ మాకు కలిసొచ్చాయి. సంతోషంగా ఉంది'అని సింధు పేర్కొంది.

గోపిచంద్ పాత్ర లేదా?

గోపిచంద్ పాత్ర లేదా?

ఇక రెండోసారి సాధించిన ఈ మెడ‌ల్‌లో పుల్లెల గోపీచంద్ కృషి, పాత్ర ఏమైనా ఉందా? అని సింధును ప్రశ్నించగా.. ఆమె భిన్నంగా స్పందించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం వెనుక ప్రస్తుత కోచ్ పార్క్ టే సంగ్ కృషే దాగి ఉందని స్పష్టం చేసింది. ‘నా కోచ్ పార్క్‌తో గత ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఉన్నాను. ఏడాదిన్న‌ర‌ కాలం నుంచి కోచ్ పార్క్ శిక్షణలో ప్రతిరోజూ ప్రాక్టిస్- చేశాను.

ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు క్రమం తప్పకుండా పాటించాను. టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ రావడంలో కోచ్ కీలకపాత్ర పోషించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా ఈయనే నాకు కోచ్‌గా ఉండాలి.'అని పీవీ సింధు పేర్కొంది. పార్క్ టే సంగ్ చాలా ప్రశాంతంగా ఉంటారని, అతనికి ఆరమ్ సే(ప్రశాంతంగా) ఉండూ అనే హిందీపదం తప్ప మరొకటి తెలియదని సింధు తెలిపింది. ప్రతీ మ్యాచ్‌లో ఆయన నాకు అదే చెప్పేవారని పేర్కొంది.

సింధు ఒక్కతే..

సింధు ఒక్కతే..

సింధు పతకం నెగ్గడంపై ఆమె కంటే కూడా కోచ్ పార్క్ టే సంగ్ సంతోషం వ్యక్తం చేశారు. తన వద్ద శిక్షణ తీసుకున్న వారిలో సింధు ఒక్కతే మెడల్ సాధించిందన్నారు.‘పీవీ సింధు చాలా బాగా ఆడింది. నేను చాలా మందికి కోచింగ్ ఇచ్చాను. కానీ నాకు ఒలింపిక్ మెడల్ సాధించి ఇచ్చిన ఒక్క ప్లేయర్ మాత్రం సింధునే. ఆమె సెమీఫైనల్లో తైజూ యింగ్‌తో జరిగిన మ్యాచ్ కొంత నిరుత్సాహానికి లోను చేసింది. కానీ కాంస్య పతకం నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఆడింది. దాంతోనే ఆమె విజ‌యం సాధించింది. నాకు కోచ్ గా అవ‌కాశం ఇచ్చిన భార‌త్‌కు కృత‌జ్ఞ‌త‌లు'అని సింధు కోచ్ పార్క్ తెలిపారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 2, 2021, 18:19 [IST]
Other articles published on Aug 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X