Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంత ధనవంతుడ్ని కాదు, ఐనా: పీవీ సింధుకు ఎన్నారై భారీ నజరానా

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు, కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్‍‌కు దుబాయ్కి చెందిన ఎన్నారై భారీ నజరానా ప్రకటించారు. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న కేరళ వాసి ముక్కత్తు సెబాస్టియన్ ఈ నజరానా ఇస్తున్నారు.

పీవీ సింధుకు రూ.50 లక్షలు, సాక్షి మాలిక్‌కు రూ.25 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన గత నలభై ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నారు.

ఆయన మాట్లాడుతూ... వారిని చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. అందుకే ఈ నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. త్వరలోనే కోచిలో ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరిస్తానన్నారు.

pv sindhu and sakshi malik

ఈ ఇద్దరు అమ్మాయిలు రియో ఒలింపిక్స్‌లో భారత్ ప్రతిష్టను కాపాడారన్నారు. వారిద్దరిని సత్కరించడాన్ని తాను చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. తాను బాగా ఉన్న వాడిని కాదని (అంత ధనవంతుడిని కాదు), దేశ ప్రతిష్ట కాపాడినవారికి ఇవ్వాలని తనకు అనిపించిందన్నారు.

సెబాస్టియన్ కేరళ రాష్ట్రంలోని కొట్టాయంకు చెందిన వారు. సెబాస్టియన్ దుబాయ్‌లో ముక్కదాన్ ప్లాంటేషన్‌ను, బెంగళూరులో వాహన రెంటల్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, రియోలో భారత్ ఇక పతకాల ఖాతా తెరవదని భావిస్తున్న తరుణంలో రెజ్లింగులో సాక్షి మాలిక్ కాంస్యం సాధించింది. ఆ తర్వాత సింధు రజతం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+