Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ ఛాంపియన్‌షిప్స్: పతకాలు ఖరారు చేసుకున్న సైనా, సింధు

గ్లాస్గో: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు చరిత్ర సృష్టించారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లలో వీరిద్దరూ విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. దీంతో వీరిద్దరూ పతకాలను ఖాయం చేసుకున్నట్లయింది.

శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అద్భుత విజయం సాధించిన సింధు సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ సన్‌ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇది ఆమెకు మూడో పతకం కానుండటం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

PV Sindhu, Saina Nehwal in World Badminton Championships semis

ఇది ఇలావుంటే.. క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌.. స్కాట్లాండ్‌ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే సెమీస్‌ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంటుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+