హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ సెమీస్‌కు చేరుకున్నారు. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో పీవీ సింధు 21-17, 21-10తో ఆకర్షి కశ్యప్‌పై, సైనా 21-17, 21-17తో శ్రియాంషిపై విజయం సాధించారు.
సెమీస్‌లో రుత్విక శివానితో సింధు, అనూరతో సైనా నెహ్వాల్ తలపడనున్నారు. క్వార్టర్స్‌లో రుత్విక 21-14, 21-8తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ)పై విజయం సాధించింది. ఇక, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీస్‌కు చేరగా.... మూడో సీడ్ సాయిప్రణీత్‌కు ఓటమి పాలయ్యాడు.

శ్రీకాంత్ 21-17, 23-21తో శుభమ్ ప్రజాపతిపై, ప్రణయ్ 22-20, 20-19తో పారుపల్లి కశ్యప్‌పై విజయం సాధించారు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి ప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో 21-13, 18-21, 20-22తో క్వాలిఫయర్ శుభాంకర్ డే (రైల్వేస్) చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మను అత్రి, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, నందగోపాల్-అల్విన్ జోడీలు క్వార్టర్స్‌ను అధిగమించారు. ఇక, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా.. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప, రితుపర్ణ-మిథుల జోడీలు సెమీస్‌కు చేరాయి.
Main results of the day:
Women's singles:
Saina Nehwal (PET) beat Aakarshi Kashyap (AAI) 21-17 21-10
P V Sindhu (AP) beat Shriyanshi Pardeshi (MP) 21-11 21-17
Men's singles:
Kidambi Srikanth (PET) beat Shubham Prajapati (MP) 21-17 23-21
Mixed doubles:
Satwik Sai Raj and Ashwini Ponnappa (AP/PET) beat Shivam Sharma and Poorvisha S Ram (RBI) 21-14 21-12