For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెన్మార్క్ ఓపెన్‌: చైనా దిగ్గజం లిన్‌ డాన్‌పై సాయిప్రణీత్‌ అద్భుత విజయం.. ప్రిక్వార్టర్స్‌లో సింధు!!

ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్‌ స్టార్ భమిడిపాటి సాయిప్రణీత్‌ మరో అద్భుత ప్రదర్శన చేసాడు. తనదైన రోజున ఎంతటి మేటి క్రీడాకారులనైనా మట్టికరిపిస్తానని సాయిప్రణీత్‌ మరోసారి రుజువు చేశాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కూడా సత్తాచాటింది. పీవీ సింధు, సాయి ప్రణీత్ డెన్మార్క్ ఓపెన్‌లో శుభారంభం చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, సౌరభ్‌వర్మ పరాజయం పాలై మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు.

ఒడెన్స్‌ (డెన్మార్క్‌):

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 36 నిమిషాల్లో 21-14, 21-17తో ప్రపంచ 18వ ర్యాంకర్, మాజీ నంబర్‌వన్, చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ (చైనా)పై సునాయాస విజయం సాధించాడు. తొలి నుంచే దూకుడు ప్రదర్శించిన సాయిప్రణీత్‌.. వరుస సెట్లలో లిన్‌ డాన్‌ను మట్టికరిపించాడు. గతంలో లిన్‌ డాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ప్రణీత్‌.. ఈసారి మాత్రం అదరగొట్టాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీస్‌లో తనను ఓడించిన ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమోటా (జపాన్)ను ప్రిక్వార్టర్స్‌లో ప్రణీత్ ఢీకొంటాడు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సింధు 38 నిమిషాల్లో 22-20, 21-18తో ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్‌ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో హోరాహోరీ పోరు సాగింది. చివర్లో 19-20తో వెనుకబడ్డ సమయంలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన సింధు.. గేమ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాతి గేమ్‌లో కూడా 16-16తో పాయింట్లు సమమైనా.. ఆ తర్వాత పుంజుకుని గేమ్‌తో పాటు మ్యాచును సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్స్‌లో అన్‌సే యంగ్ (కొరియా)తో సింధు తలపడనుంది.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్‌ వర్మ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 25వ ర్యాంకర్‌, కామన్వెవెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ కశ్యప్‌ 13-21, 12-21తో సితికోమ్‌ తమాసిన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో.. సౌరభ్‌ వర్మ 21-19, 11-21, 17-21తో మార్క్‌ కాల్జూ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయారు. థాయ్‌లాండ్ ఓపెన్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి 24-22, 21-11 తేడాతో కొరియా ద్వయం కిమ్ జీజంగ్ - లీయంగ్‌పై మొదటి రౌండ్‌లో విజయం సాధించారు.

Story first published: Wednesday, October 16, 2019, 8:54 [IST]
Other articles published on Oct 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+