Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏమవుతుందో చూడాలి: రియో తర్వాత రాకెట్ పట్టిన సింధు

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత షట్లర్ పీవీ సింధు కోర్టులో అడుగుపెట్టనుంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నేపథ్యంలో సన్మానాలు అందుకోవడం, ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరవ్వడం లాంటి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. తిరిగి మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది.

దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌తో కోర్టులోకి అడుగుపెట్టనుంది. మంగళవారం నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్ సూపర్‌సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో సింధు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత సింధు ఆడనున్న తొలి టోర్నమెంట్ ఇదే కావడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి విజేతగా నిలిచి తన ఖాతాలో లేని ఈ సూపర్ సిరీస్ టైటిల్‌ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. టోర్నీలో భాగంగా సింధు బుధవారం జరిగే సింగిల్స్ తొలిరౌండ్లో చైనాకు చెందిన హె బిన్‌గ్జియావోతో తలపడనుంది. కాగా, సైనా నెహ్వాల్‌ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు.

పీవీ సింధు గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

PV Sindhu returns at Denmark Open after Rio 2016 Olympics

మోకాలి గాయానికి శస్త్ర చికిత్స తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. 'రియో ఒలింపిక్స్ ప్రదర్శనతో నాలో చాలా ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే ఉత్సాహంతో ఈ టోర్నీలో మెరుగ్గా రాణిస్తానని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి నాపై మరింత బాధ్యత పెరిగింది. అయితే ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ అనవసరంగా ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు' అని తెలిపింది.

విజయం కోసం ఎప్పటిలాగే వందశాతం కృషి చేస్తానని సింధు పేర్కొంది. ఈ టోర్నీలో తన పార్శంలోనున్న 2వ సీడ్ రచానోక్, 4వ సీడ్ తాయ్ జూ యింగ్‌లాంటి స్టార్లను ఓడిస్తే సింధుకు ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ ఎదురుపడే అవకాశముంది. రియోలో ఫైనల్లో సింధును ఓడించి మారిన్ స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో పోటీపడుతున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో అతను రౌల్ మస్ట్ (ఎస్తోనియా)తో ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మను అత్రి, ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ జోడీలు, మిక్స్‌డ్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జంట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+