
సునాయసంగా గెలిచిన సింధు
నేడు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింధు అదరగొట్టింది. ప్రత్యర్థి ఇరా శర్మను సునాయసంగా ఓడించి క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. కెడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నేడు ఇరా శర్మ, పీవీ సింధు తలపడ్డారు. తనదైన రీతిలో సింధు సత్తా చాటడంతో ఇరాశర్మ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో తొలి సెట్‌ను 13 నిముషాల్లోనే ముగించిన 26 ఏళ్ల సింధు 21-10 తేడాతో గెలుచుకుంది. ఇక రెండో సెట్‌లోనూ సింధు అధిపత్యం కొనసాగింది. 17 నిముషాలపాటు సాగిన రెండో సెట్‌లో సింధు 21-10 తేడాతో గెలిచింది. మొత్తంగా మ్యాచ్‌ను 30 నిముషాల్లోనే ముగించింది. 21-10, 21-10తో ఇరా శర్మను ఓడించి ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది.

నిరాశ పరిచిన సైనా
మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో భారత సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తీవ్రంగా నిరాశపరించింది. మాళవిక బన్సోద్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 ఏళ్ల సైనా 21-17, 21-9 తేడాతో ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. తొలి సెట్‌లో 5-7తో వెనుకబడిన సైనా ఎక్కడా కూడా మ్యాచ్‌లో గెలిచేలా కనిపించలేదు. 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో గెలిచి మాళవిక బన్సోద్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

కరోనా కలకలం
మరోవైపు ఇండియా ఓపెన్‌లో నేడు కరోనా కలకలం రేగింది. ఏకంగా ఏడుగురు భారత క్రీడాకారులు వైరస్ బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్‌తోపాటు అశ్విని పొన్నప్ప కూడా ఉన్నారు. వీరితో పాటు కరోనా బారిన పడ్డ వారిలో రితికా రాహుల్ థాకర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింఘి, ఖుషీ గుప్తా కూడా ఉన్నారు. వీరందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వీరంతా టోర్నీ నుంచి తప్పుకుని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు ఆడాల్సిన డబుల్స్ ఆటగాళ్లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారు. వారు కూడా ఐసోలేషన్‌లోనే ఉన్నారు.


Click it and Unblock the Notifications












