Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరిగింది?: సింధుకు చేదు అనుభవంపై ఇండిగో ఎయిర్‌లైన్స్

హైదరాబాద్: గ్రౌండ్ స్టాఫ్‌లోని అజితేష్ అనే వ్యక్తి తన పట్ల అనాగరికంగా ప్రవర్తించాడని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేసిన ట్వీట్‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. పీవీ సింధు శనివారం హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ 6E 608 విమానం ఎక్కారు.

ఫ్లైట్ ఎక్కే సమయంలో తన లగేజీ విషయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అజితేశ్ తనపట్ల అమర్యాదగా ప్రవర్తించాడంటూ సింధు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గోడవ జరిగే సమయంలో ఎయిర్ హోస్టెస్ అషిమా అతనికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినలేదని, పైగా ఆమె పట్లకూడా అజితేశ్ దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది.

సింధు

సింధు

ఇలాంటి వ్యక్తి సిబ్బందిగా ఉంటే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఖ్యాతి దెబ్బతింటుందని సింధు ట్విట్టర్‌లో పేర్కొంది. పీవీ సింధు ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ వెంటనే స్పందించింది. సింధు ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని చెప్పింది.

 తమ సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదు

తమ సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదు

ప్రయాణికులు పట్ల తమ సిబ్బంది మర్యాదగానే నడుచుకున్నారని ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. కేవలం విధుల ప్రకారమే నడుచుకున్నారని ఎయిర్ లైన్స్ తెలిపింది.

లగేజీ విషయంలో సింధుతో చిన్నపాటి వివాదం

లగేజీ విషయంలో సింధుతో చిన్నపాటి వివాదం

లగేజీ విషయంలో విమానంలో సింధుతో చిన్న వివాదం చెలరేగిందని.. తాను అధిక బరువు ఉన్న లగేజీని తీసుకురావడం వల్ల అది బిన్‌లో పట్టలేదని, అందుకే సింధుకు విషయం తెలియజేసి దానిని కార్గోకు మారుస్తామని తమ సిబ్బంది కోరగా సింధు తొలుత అంగీకరించలేదని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

ఏ కస్టమర్‌కైనా అవే నిబంధనలు ఫాలో అవుతాం

ఏ కస్టమర్‌కైనా అవే నిబంధనలు ఫాలో అవుతాం

ఆ తర్వాత సింధు తన లగేజీని కార్గోకు తరలించడానికి ఒప్పుకున్నదని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ఏ కస్టమర్‌కైనా తాము అవే నిబంధనలు ఫాలో అవుతామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+