For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీనా, తెలంగాణనా?: నవ్విన సింధు, చెప్పిన గోపీచంద్, సైనాపై ప్రశంసలు

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు తెలంగాణకు చెందినవారా, ఏపీకి చెందిన వారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. సింధు నవ్వేసింది. కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ.. ఆమె భారతీయురాలు అని చెప్పారు.

గచ్చిబౌలి స్టేడియంలో సన్మానం అనంతరం పీవీ సింధును, గోపీచంద్‌ను గుర్రపు బగ్గీలో గోపీచంద్ అకాడమీకి తీసుకు వెళ్లారు. సింధును అభిమానులు గజమాలతో సత్కరించారు. పుష్పాలతో స్వాగతం పలికారు. అనంతరం గోపీచంద్, సింధు మీడియాతో మాట్లాడారు.

సింధుకు కొత్త కోచ్: గోపీచంద్‌కు 'తెలంగాణ' షాక్, నేతల క్యూ(పిక్చర్స్)సింధు మాట్లాడుతూ.. ఓలింపిక్స్‌లో పతకం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఒలింపిక్స్‌కు రెండు నెలల ముందు నుంచే చాలా కష్టపడ్డామన్నారు. గోపీచంద్ అకాడమీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కోచ్ మద్దతు వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.

క్రీడల్లో మహిళలకు తల్లిదండ్రుల మద్దతు చాలా అవసరమని చెప్పారు. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్నది తన లక్ష్యమని, అది నెరవేరిందని పీవీ సింధు చెప్పారు. పైనల్లో మారిన్ తన పైన గెలిచిన అనంతరం ఆమెను తాను అభినందించానని చెప్పారు.

PV Sindhu, Pullela Gopichand felicitated on return to India

రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాలనుకున్నానని సింధు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించిందని, అందుకు ధన్యవాదాలు అని పీవీ సింధు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమకు మద్దతు పలికిందన్నారు.

రెండు నెలలు సెలవు పెట్టిన పీవీ సింధు తండ్రి

పీవీ సింధు తెలంగాణకు చెందిన వారా లేక ఏపీకి చెందిన వారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. సింధు నవ్వేసింది. మైక్ తీసుకున్న గోపీచంద్.. ఆమె భారతీయురాలు అని చెప్పారు. తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు అభినందనలు తెలిపారని గోపీచంద్ చెప్పారు.

గోపీచంద్ ఇంకా మాట్లాడుతూ... మెరుగైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. సింధు అకాడమీకీ చెప్పిన సమయానికి వచ్చి కష్టపడిందని తెలిపారు. సింధును తెల్లవారుజామున ప్రాక్టీస్ కోసం ఆమె తండ్రి పీవీ రమణ రెండు నెలల పాటు సెలవు పెట్టారని చెప్పారు.

లాస్ట్ 21 రోజులు కూడా ఇలా మాట్లాడలేదు

విలేకరులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండగా పీవీ సింధు, గోపీచంద్ సమాధానం ఇచ్చారు. ఓ సమయంలో గోపీచంద్ మాట్లాడుతూ.. లాస్ట్ 21 రోజులు కలిపి కూడా తాను ఇంత మాట్లాడలేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. సింధు భవిష్యత్తులో బంగారు పతకం సాధిస్తుందన్నారు.

సైనా పైన ప్రశంసలు

సైనా నెహ్వాల్ పైన పీవీ సింధు ప్రశంసలు కురిపించారు. దేశం కోసం సైనా ఎంతో క‌ష్టప‌డిందన్నారు. గ‌తంలో సైనా నెహ్వాల్ ఎన్నో మెడల్స్ సాధించిందని గుర్తు చేసింది. భార‌త బ్యాడ్మింట‌న్‌కు సైనా అందించిన సేవ ఎంతో గొప్ప‌దని పేర్కొన్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+